Bank Loan: బ్యాంక్‌ లోన్ డబ్బులు పడిన మరుక్షణమే అకౌంట్‌లోంచి రూ.7.23 లక్షలు కట్.. ఆమె చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..

ABN , First Publish Date - 2023-04-21T18:40:30+05:30 IST

మహిళ ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద మూల్యం చెల్లించుకుంది. తన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు అలా జమ అయ్యాయో లేదో ఇలా కట్ అయిపోయాయి. అది కూడా వెయ్యి రెండు వేలు కాదు.. ఏకంగా 7.23లక్షల రూపాయలు...

Bank Loan: బ్యాంక్‌ లోన్ డబ్బులు పడిన మరుక్షణమే అకౌంట్‌లోంచి రూ.7.23 లక్షలు కట్.. ఆమె చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో..

ఈకాలంలో చిన్నచిన్న పొరపాట్ల వల్ల బ్యాంకు అకౌంట్లలో ఉన్న లక్షలాది రూపాయలు సునాయాసంగా పోగొట్టుకుంటున్నారు చాలామంది. ఓ మహిళ తన అమాయకత్వంతో చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల పెద్ద మూల్యం చెల్లించుకుంది. తన బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బు అలా జమ అయ్యాయో లేదో ఇలా కట్ అయిపోయాయి. అది కూడా వెయ్యి రెండు వేలు కాదు.. ఏకంగా 7.23లక్షల రూపాయలు అలా కట్ కావడంతో ఆమెకు గుండె ఆగినంత పనయింది. పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ముంబైకి(Mumbai) చెందిన పాయల్ అనే 27ఏళ్ల మహిళ లోయర్ పరేల్(Lower parel) ఆధారిత సంస్థలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తోంది. ఈమెకు ఈ నెల 17వ తేదీన యూట్యూబ్ సబ్స్కిప్షన్(you tube subscription) లు పెంచే ఉద్యోగమంటూ వాట్సాప్ కు ఒక మెసేజ్(WhatsApp message) వచ్చింది. ఇదేంటి పార్ట్ టైమ్ జాబ్ లా ఉందే ఏమైనా ఇన్కమ్ ఉంటుందేమో అని ఆమె మెసేజ్ లో ఉన్న లింక్ మీద టచ్ చేసింది. ఆ లింక్ టచ్ చేయగానే వీడియో షేరింగ్ చేసే సైట్ ఓపెన్ అయ్యింది. అక్కడ సూచించిన విధంగా ఆమె రెండు ఛానల్స్ ను లైక్ చెయ్యగానే ఆమెకు 60/రూపాయలు వచ్చాయి. ఆ తరువాత ఆమెకు ఒక జాబ్ కోడ్(job code) ఇచ్చారు. టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఆమె టెలిగ్రామ్ లో జాయిన్ అయిన తరువాత ఆమెకు కొన్ని పనులు అప్పగించారు. ఆ ప్రాసెస్ లో ఆమె 580/ రూపాయలు వారికి చెల్లించింది. ఆ తరువాత ఆమెకు 754/రూపాయలు తిగిరి వచ్చాయి. ఇదే విధంగా 9,900/రూపాయలు చెల్లించగా ఆమెకు 12,833/రూపాయలు వచ్చాయి. ఇదేదో బాగుందే అనుకుని ఆమె సంతోష పడింది.

Viral Video: బ్యాంకుల్లో కరెన్సీ నోట్లను లెక్కించే మెషీన్లు కూడా ఈ యువతి ముందు దిగదుడుపే.. డబ్బుల్ని ఈమె ఎలా లెక్కిస్తోందో చూస్తే..!


ఇదంతా జరిగిన తరువాత అంతకు ముందే బ్యాంకు రుణం కోసం ఆమె పెట్టుకున్న అప్లికేషన్ ఓకే అయ్యి ఆమెకు డబ్బు సాంక్షన్ అయ్యాయి. 6.27 లక్షల రూపాయల రుణం ఆమె ఖాతాలో జమ అయ్యాయి. అంతకు ముందే ఉన్న డబ్బుతో సహా మొత్తం 7.23లక్షల రూపాయలు కట్ అయ్యాయి. ఈ సంఘటనతో ఆమె గుండె ఆగినంత పనయ్యింది. ఆమెకు వెంటనే అనుమానం వచ్చి టెలిగ్రామ్ ఛానెల్ వారిని సంప్రదించింది. ఆ డబ్బు తిరిగి ఇచ్చేయాలి అంటే మాకు 10లక్షలు ఇవ్వాలని వారు చెప్పారు. 'కోల్పోయింది 7.23లక్షలు అయితే దానికోసం 10లక్షలు చెల్లించడమేంటి?' అని ఆమె ప్రశ్నించింది. 'అదంతే..' అని వారు సమాధానం చెప్పడంతో తాను మోసపోయానని ఆమెకు అర్థమైంది. ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్ళబోసుకుంది. పోలీసులు ఆమె ఫిర్యాదు మెరకు గుర్తుతెలియని వ్యక్తుల మీద 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందులను గుర్తించేందుకు గానూ బ్యాంకు అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

Viral News: అక్కడి నుంచి చూస్తే చందమామ తలకిందులుగా కనిపిస్తుందా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చర్చ..!


Updated Date - 2023-04-21T18:40:30+05:30 IST