Viral Video: బ్యాంకుల్లో కరెన్సీ నోట్లను లెక్కించే మెషీన్లు కూడా ఈ యువతి ముందు దిగదుడుపే.. డబ్బుల్ని ఈమె ఎలా లెక్కిస్తోందో చూస్తే..!

ABN , First Publish Date - 2023-04-21T15:27:59+05:30 IST

ఈ మహిళ క్యాష్ కౌంట్ చేయడం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి.

Viral Video: బ్యాంకుల్లో కరెన్సీ నోట్లను లెక్కించే మెషీన్లు కూడా ఈ యువతి ముందు దిగదుడుపే.. డబ్బుల్ని ఈమె ఎలా లెక్కిస్తోందో చూస్తే..!

అందరూ సాధారణంగా చేసే పనులనే కొందరు మరింత ప్రావీణ్యంతో చేస్తుంటారు. ఇంట్లో నాన్న కట్టలకొద్ది డబ్బు లెక్క పెడుతున్నప్పుడు 'అబ్బా అంత స్పీడ్ ఎలా లెక్కపెడతారో' అని అబ్బురంగా చూసేవాళ్లం. బ్యాంకులోనూ, క్యాష్ కౌంటర్లలోనూ క్యాషియర్లను చూసినప్పుడు అశ్చర్యం కలగడం సహజం. కానీ ఈ మహిళ క్యాష్ కౌంట్ చేయడం చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. 'బాబోయ్ బ్యాంకులో మెషీన్ లు కూడా ఈమె ముందు పనికిరావేమో..' అంటున్నారు. ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. వేగవంతమైన కాలానికి తగ్గట్టు చాలా స్కిల్స్ అవసరం అవుతాయి. వాటిలో అకౌంట్స్ చూడటం, డబ్బు లెక్కపెట్టడం(Money counting) కూడా ఒకటి. క్యాష్ కౌంటర్లలో కూర్చుని కరెన్సీ నోట్లను స్పీడుగా లెక్కబెట్టడం అందరికీ సాధ్యం కాదు. అందులోనూ లెక్క తప్పకుండా మనీ కౌంటింగ్(Money counting) అంత ఈజీ ఏమీ కాదు. ఎక్కడ పనిచేస్తోందో తెలీదు కానీ ఓ మహిళ క్యాష్ కౌంటర్(cash counter) లో ఉంది. కట్టలకొద్దీ కరెన్సీ నోట్లను సెకెన్ల వ్యవధిలో(Money count in seconds) అలవోకగా లెక్కబెట్టేస్తోంది. ఈమె డబ్బు లెక్కబెడుతున్న తీరు చూసి అందరూ షాకవుతున్నారు. CCTV IDIOTS అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కళ్ళు తేలేస్తున్నారు. 'అసలు ఆమెవి చేతులా లేక మెషీన్లా?' అంటున్నారు. 'బ్యాంకులో క్యాష్ కౌంటింగ్ మెషీన్లు కూడా ఇంత వేగంగా పనిచేయవు, ఇలాంటి వాళ్ళు బ్యాంకుకు ఒక్కరుంటే చాలు' అని మరికొందరు అంటున్నారు.

Viral News: తల్లి నుంచి మెసేజ్.. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా.. ఏమైనా అర్జెంటా..? అని ఆ కొడుకు అడిగితే తల్లి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి..


Updated Date - 2023-04-21T15:27:59+05:30 IST