Viral News: అక్కడి నుంచి చూస్తే చందమామ తలకిందులుగా కనిపిస్తుందా..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చర్చ..!

ABN , First Publish Date - 2023-04-21T18:09:47+05:30 IST

మా ప్రాంతంలో చందమామ తలకిందులుగా కనబడతాడని కొందరు అంటున్నారు.

Viral News: అక్కడి నుంచి చూస్తే చందమామ తలకిందులుగా కనిపిస్తుందా..?   సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చర్చ..!

ఆకాశంలో నక్షత్రాల మధ్య ధగధగా మెరిసిపోయే చందమామను మనం రేరాజు అని పిలుచుకుంటాం. ఉదయమంతా సూర్యుడి సామ్రాజ్యం అయితే రాత్రవ్వగానే చంద్రుడి హవా మొదలవుతుంది. మనం ఇలా ఎన్ని కథలు చెప్పుకున్నా భూమికి ఉన్న సహజ ఉపగ్రహాలలో చంద్రుడు ఒకటనేది సైన్స్ చెప్పే విషయం. భూమికి సూర్యుడికి మధ్య 3,84,403 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే చందమామ ఈ భూమి మీద ఉన్న అందరికీ ఒకే విధంగా కనబడతాడా అంటే కాదంటున్నారు. మా ప్రాంతంలో చందమామ తలకిందులుగా కనబడతాడని కొందరు అంటున్నారు. అసలింతకీ చందమామ తలకిందులుగా కనబడేది ఎక్కడ? వాళ్ళకెందుకు తలకిందులుగా కనబడుతున్నాడు? దీనిగురించి అంత చర్చ ఎందుకు జరుగుతోంది పూర్తీగా తెలుసుకుంటే..

అంతరిక్షంలో(space) బోలెడు రహస్యాలు ఉన్నాయి. సౌర వ్యవస్థ(solar system) గురించి, గ్రహాల(planets) గురించి కొత్త కొత్త విషయాలు ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడూ చందమామ తలకిందులుగా(Moon upside down) ఉంటాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా దేశంలో చంద్రుడు తలకిందులుగా కనిపిస్తాడు అని రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఒక వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను ఈ మధ్యే ఆస్ట్రేలియాలో(Australia) ఉన్న నా జీవిత భాగస్వామిని(Life partner) చూడటానికి వెళ్ళాను. అక్కడ చందమామ తలకిందులుగా కనిపిస్తున్నాడనే విషయం గ్రహించి నేను షాకయ్యాను' అని తన రెడ్డిట్ పోస్ట్ లో పేర్కొన్నాడు. u/trimdaddyflex అనే అకౌంట్ ద్వారా అక్కడ తీసిన చందమామ ఫోటోను భాగస్వామ్యం చేశారు. చందమామ తలకిందులుగా కనిపించడమనే ఈ విషయం గురించి వివిధ దేశాల పౌరులు వాదించుకుంటున్నారు. 'యూకే(UK) లో ప్రజలు చందమామను తలకిందులుగా చూస్తారు' అని అక్కడి వారు వాదిస్తున్నారు. 'యూరోప్(Europe) లో చంద్రుడు తలకిందులుగా ఉంటాడు' అని మరొకరు అన్నారు. కాగా న్యూజిలాండ్(New Zealand) కు చెందిన ఓ వ్యక్తి మాత్రం 'మేము చందమామను సాధారణంగానే చూస్తున్నాం. చందమామ మీద కుందేలు(Rabbit) ఆకారం కనిపిస్తుంది. ఉత్తరార్దగోళ ప్రజలు చాలా విచిత్రాలు చూస్తున్నారు, చందమామను తలకిందులు చేస్తున్నారు' అని అన్నారు.

Viral News: తల్లి నుంచి మెసేజ్.. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా.. ఏమైనా అర్జెంటా..? అని ఆ కొడుకు అడిగితే తల్లి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి..


కాగా చందమామ ఇలా తలకిందులుగా కనిపించడం భౌగోళిక అంశమని కొందరు అంటున్నారు. ఉత్తరార్ద గోళంతో పోలిస్తే వేరే ప్రాంతాల ప్రజలకు చంద్రుడు విభిన్నంగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు చందమామ కనిపించే విషయంలో ఇంత చర్చ, రాద్దాంతం ఏమిటో అంటున్నారు.

Viral Video: బ్యాంకుల్లో కరెన్సీ నోట్లను లెక్కించే మెషీన్లు కూడా ఈ యువతి ముందు దిగదుడుపే.. డబ్బుల్ని ఈమె ఎలా లెక్కిస్తోందో చూస్తే..!


Updated Date - 2023-04-21T18:09:47+05:30 IST