Baby panda: పాపం.. ఉయ్యాల ఎక్కేందుకు ఆ బేబీ పాండా ఎంత అవస్థ పడుతోందో.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ABN , First Publish Date - 2023-06-11T15:44:26+05:30 IST

భూమిపై సంచరిస్తున్న అందమైన జంతువులలో పాండాలు కూడా ఒకటి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పాండాలకు సంబంధించిన వీడియోలు అందరికీ చేరుతున్నాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి.

Baby panda: పాపం.. ఉయ్యాల ఎక్కేందుకు ఆ బేబీ పాండా ఎంత అవస్థ పడుతోందో.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

భూమిపై సంచరిస్తున్న అందమైన జంతువులలో పాండాలు (Panda) కూడా ఒకటి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పాండాలకు సంబంధించిన వీడియోలు అందరికీ చేరుతున్నాయి. వాటిల్లో కొన్ని నెటిజన్లను ఆకట్టుకుని వైరల్ (Viral Video) అవుతున్నాయి. ప్రస్తుతం పాండాలకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ బుల్లి పాండా ఓ ఉయ్యాల ఎక్కేందుకు తంటాలు పడుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బుల్లి పాండా ఉయ్యాల పైకి ఎక్కడానికి ప్రయత్నించి విఫలమవుతోంది. పై నుంచి నేల మీద పడిపోయింది. అయినప్పటికీ, ఆ పాండా పట్టు వదల్లేదు. మళ్లీ లేచి ఉయ్యాల ఎక్కడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కూడా రెండుసార్లు పల్టీలు కొట్టి కింద పడింది. ఈ క్యూట్ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు.

Viral Video: ఈ బుడ్డోడి మనసు పెద్దది.. పక్షులకు నీరు అందించేందుకు ఎంత తపన పడుతున్నాడో చూడండి..

ఆ వీడియో తమ రోజును చాలా సంతోషకరంగా మార్చిందని కొందరు కామెంట్లు చేశారు. ``100 శాతం క్యూట్``, ``చిన్న పిల్లల్లాగనే పాండాలు కూడా ఆడుకుంటున్నాయి`` అని మరికొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-06-11T15:53:03+05:30 IST