పడకగదిలోకి వెళ్లిన మహిళ...ఆ దృశ్యం చూసి షాక్

ABN , First Publish Date - 2023-03-23T09:05:12+05:30 IST

పడక గదిలోకి వెళ్లిన ఓ మహిళ బెడ్‌పై ఉన్న ఆ దృశ్యం చూసి షాక్‌కు గురైంది....

 పడకగదిలోకి వెళ్లిన మహిళ...ఆ దృశ్యం చూసి షాక్
Snake Slithering In Her Bed

క్వీన్స్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా): పడక గదిలోకి వెళ్లిన ఓ మహిళ బెడ్‌పై ఉన్న ఆ దృశ్యం చూసి షాక్‌కు గురైంది. ప్రజలు సాధారణంగా పాములను చూసి భయపడతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో ఒక మహిళ(Australian Woman) తన పడకగదిలోకి వెళ్లగా, ఆమె మంచంపై 6 అడుగుల విషపూరితమైన పాము పొంచి ఉన్నట్లు గుర్తించి షాక్ అయింది.(Snake Slithering In Her Bed)

మంచం దుప్పటి కింద అత్యంత విషపూరితమైన ఆరు అడుగుల గోథుమ రంగు పాము కనిపించింది. దీంతో వెంటనే తలుపు మూసివేసి పాము బెడ్రూం(bedroom) నుంచి బయటకు రాకుండా టవల్ అడ్డు పెట్టింది. అనంతరం పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేసింది. తాను వెళ్లి పడకగది తలుపు తీసి చూడగా పాము మంచంపై పడుకొని ఉందని జాచెరీస్ స్నేక్ అండ్ రెప్టైల్ రీలోకేషన్ యజమాని జాచెరీ రిచర్డ్స్ చెప్పారు.

ఇది కూడా చదవండి : Amritpal Singh:మహిళలతో వివాహేతర సంబంధాలు...వీడియో కాల్స్‌లో ముద్దుల వర్షం...ఇదీ ఖలిస్థాన్ నేత నిర్వాకం

పడకగదిలోకి పాము ప్రత్యక్షమవడంతో పడుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించిండని సదరు మహిళ ఫేస్‌బుక్ పోస్ట్ లో పేర్కొంది. వేడి వాతావరణం నుంచి తప్పించుకునేందుకు పాము తెరిచిన తలుపు నుంచి వచ్చిందని, దాన్ని పట్టుకొని బుష్ ల్యాండ్ సమీపంలో వదిలినట్లు రిచర్ఢ్స్ చెప్పారు.ఆస్ట్రేలియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఉన్నాయి. ఈ పాము కాటు వేస్తే బాధితుడి గుండె, ఊపిరితిత్తులు, నరాలు స్తంభించిపోతాయి.

Updated Date - 2023-03-23T09:37:34+05:30 IST