V‏iral Video: డ్యాన్స్ చేస్తున్న ఈ పెళ్లికొడుకును చూసి ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2023-05-31T17:05:42+05:30 IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఇంటర్నెట్‌ను తుఫాను సృష్టిస్తోంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోని రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీ బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను భారతీయ వరుడిగా మళ్లీ రూపొందించింది. ఇప్పుడది నెట్టింట యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది.

V‏iral Video: డ్యాన్స్ చేస్తున్న ఈ పెళ్లికొడుకును చూసి ఇది కలా? నిజమా? అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..!

ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence (AI) ఆధారిత వైరల్ కంటెంట్ ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ట్రెండ్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు పంచుకుంటున్న కళాత్మక ఫోటోలు(Artsy Illustrations) హల్‌చల్ చేస్తున్నాయి. ఔత్సాహికులు శక్తివంతమైన ఈ (AI) టెక్నాలజీని ఉపయోగించి వాస్తవిక, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోని రోలింగ్ కాన్వాస్ ప్రెజెంటేషన్స్ అనే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీ బిలియనీర్ ఎలాన్ మస్క్‌(Elon Musk)ను భారతీయ వరుడిగా రూపొందించింది. ఇప్పుడది నెట్టింట యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు మిడ్ జెర్నీ(Midjourney) ప్రొగ్రామ్ ఉపయోగించి రూపొందించారు. కస్తూరి షేర్వాణీ(Sherwani) ధరించి, పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, గుర్రపు స్వారీ(Riding A Horse) చేస్తున్నట్టు ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటోలతోపాటు షేర్ చేసిన శీర్షిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రపంచం వేగంగా మారుతోంది. "ఎలాన్ మస్క్(Elon Musk) భారతీయ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టుగా ఊహించి ఈ చిత్రాలను సృష్టించబడ్డాయి. మనం మన ఊహలను కాగితంపై చిత్రించే కాలం నుంచి ఇప్పటి వరకు AIకి తెలియజేస్తే అది వాటిని వాస్తవికతకు తీసుకువస్తుంది. అవి సజీవంగా మార్పులు చేయబడి బాగా ఆకర్షిస్తున్నాయి. ఇది మంచికో లేదా చెడుకో తెలియదు కానీ అది జరుగుతోంది. ప్రపంచం వేగంగా మారుతోంది." అంటూ రాశారు.

అయితే నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్ కళాకారుడి పనితనాన్ని తెగ ఇష్టపడుతున్నారు. ఎలాన్ మస్క్‌ను భారతీయ వరుడిగా చూసి చాలా థ్రిల్ అవుతున్నారు. ‘‘ఓ మై గాడ్ నిజంగా ఇది నిజమని భావించాను. మొత్తానికి ఈ పోస్ట్‌తో మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను ’’ అని ఓ నెటిజన్ రాశాడు. ‘‘ నేను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. ఇది ఏఐ ద్వారా సృష్టించబడిందని’’ అంటూ మరో నెటిజన్ రాశాడు. ‘భవిష్యత్తులో ఏది నిజమో నకిలీదో మీకు తెలియదు. చాలా క్రేజీగా ఉంది’’ అని మరో నెటిజన్ రాశాడు.

ఒక AI ఆర్టిస్ట్ మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి చారిత్రక వ్యక్తుల చమత్కార చిత్రాలను విడుదల చేశాడు. వారు వారి కాలంలో జిమ్ చేస్తే వారు ఎలా ఉండేవారో ఊహించారు. ఆ పోస్ట్‌లో మహాత్మాగాంధీ, విలియం షేక్స్‌పియర్, ఐజాక్ న్యూటన్, కార్ల్ మార్క్స్, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్రహం లింకన్, విన్సెంట్ వాన్ గోగ్, నెల్సన్ మండేలా, నికోలా టెస్లా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఉన్నారు.

ఈ చిత్రాల్లో మహాత్మా గాంధీని కండరాల వీరుడిగా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిక్క్ ప్యాక్‌తో, రవీంద్రనాథ్ ఠాగూర్ తన కండలు తిరిగిన శరీరాకృతిని ప్రదర్శిస్తున్నట్లు చూపించారు. ఇతర చారిత్రక వ్యక్తులు ఉబ్బిన కండరాలు, కండరపుష్టితో కండలుగల దృఢమైన వ్యక్తులుగా కూడా చూపబడ్డారు.

Updated Date - 2023-05-31T17:29:26+05:30 IST