WhatsApp: ఇకపై వాట్సప్ చాట్ మధ్యలో యాడ్స్?.. క్లారిటీ ఇచ్చిన మెటా..
ABN , First Publish Date - 2023-09-15T16:32:00+05:30 IST
‘ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన అమెరికా టెక్ దిగ్గజం మెటా (Meta) ‘వాట్సప్’లో (WhatsApp) యాడ్స్ ఇవ్వాలని భావిస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో యాడ్స్ రాబోతున్నాయి. చాట్స్ మధ్యలో యాడ్స్ ఉంటాయి’ అంటూ జోరుగా రిపోర్టులు వెలువడుతున్నాయి.
‘ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన అమెరికా టెక్ దిగ్గజం మెటా (Meta) ‘వాట్సప్’లో (WhatsApp) యాడ్స్ ఇవ్వాలని భావిస్తోంది. త్వరలోనే వాట్సప్‌లో యాడ్స్ రాబోతున్నాయి. చాట్స్ మధ్యలో యాడ్స్ ఉంటాయి’ అంటూ జోరుగా రిపోర్టులు వెలువడుతున్నాయి. ఇటివలే ‘ది ఫైనాన్సియల్ టైమ్స్’లో వెలువడిన ఒక రిపోర్ట్ ఈ ప్రచారానికి ప్రధాన కారణమైంది. కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోందని, కాంటాక్టుల చాట్ స్ర్కీన్‌పై యాడ్స్ రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కంపెనీ సంప్రదింపులు జరుపుతోందని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యాడ్స్ రహిత వినియోగం కోసం సబ్‌స్ర్కిప్షన్ ఛార్జీ వసూలు చేయాలని భావిస్తోందంటూ సదరు రిపోర్ట్ పేర్కొంది. వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ విషయంలో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆదాయం పెంపుపై మెటా ఈ మేరకు దృష్టిసారించిందని, ఒక వేళ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే చాటింగ్‌లో యాడ్స్ కనిపిస్తాయని పేర్కొంది. ఫేస్‌బుక్ మెసెంజర్, జీమెయిల్‌లో ఈమెయిల్‌లో మాదిరిగా యాడ్స్ కనిపిస్తాయని ప్రస్తావించింది. అయితే విస్తృతంగా జరుగుతున్న ఈ ప్రచారంపై అమెరికన్ టెక్ దిగ్గజం, వాట్సప్ మాతృసంస్థ మెటా (Meta) స్పష్టతనిచ్చింది.
ఫుల్ క్లారిటీ ఇచ్చిన మెటా...
‘ది ఫైనాన్సియల్ టైమ్స్’లో (The Financial Times) వెలువడిన కథనంపై వాట్సప్ మాతృసంస్థ మెటా స్పందించింది. ‘వాట్సప్‌లో యాడ్స్ కోసం ఎలాంటి వర్క్ జరగడం’ అని వాట్సప్ హెడ్ విల్ కాత్‌కార్ట్ (Will Cathcart) ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా స్పష్టతనిచ్చారు. ఫైనాన్సియల్ టైమ్స్ కథనం అవాస్తవమైనదని, అలాంటిదేమీ తాము చేయడంలేదని పోస్టులో రాసుకొచ్చాడు. కంపెనీలో ప్రతిఒక్కరి మాటలకు తాము బాధ్యత వహించబోమని మరో ప్రకటనలో వాట్సప్ తెలిపింది. వాట్సప్‌లో ప్రకటనలకు సంబంధించి తమవద్ద ఎలాంటి ప్రణాళికాలేదని, అలాంటి వర్క్ ఏమీ జరగడంలేదని తెలిపింది. ఇదిలావుండగా వాట్సప్‌కి ప్రపంచవ్యాప్తంగా విస్తృత పాపులారిటీ ఉంది. కంపెనీ లెక్కల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి 200 మిలియన్లకుపైగా యూజర్లు ఉండడం గమనార్హం.