Anushka: స్టాండప్ కమెడియన్‌తో చెఫ్‌.. శెట్టిల హంగామా

ABN , First Publish Date - 2023-03-01T17:03:36+05:30 IST

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty). ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Anushka: స్టాండప్ కమెడియన్‌తో చెఫ్‌.. శెట్టిల హంగామా

సినీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది లేకుండా స్వ శక్తితో ఎదిగిన నటుడు నవీన్‌ పోలిశెట్టి (Naveen Polishetty). ‘ఏజెంట్‌ శ్రీనివాస్‌ ఆత్రేయ’ తో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘జాతిరత్నాలు’ తో సినీ ఇండస్ర్టీ చూపును మొత్తం తన వైపునకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. నవీన్‌ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. పి. మహేష్‌ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు.

అనుష్క, నవీన్‌ సినిమాకు ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) అని టైటిల్ పెట్టారు. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటిస్తున్నాడు. అనుష్క ఇంటర్నేషనల్ చెఫ్‌ పాత్రను పోషిస్తోంది. రధన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ చేస్తున్నాడు. నవీన్ అంతకు ముందు అనుష్కతో మాట్లాడుతున్నట్టు ఆమె అటెన్షన్‌ కోసం తిప్పలు పడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. ‘స్వీటీ ఎంతోమంది స్టార్‌ హీరోలతో కలిసి నటించినా తన ఫేవరేట్‌ హీరోను నేనే అట. అలాగని బయట చెప్పుకుంటున్నారు’’ అని సరదాగా సంభాషించాడు. అనుష్క సినిమా పోస్టర్స్‌ను చూపిస్తూ రెండు, మూడు టైటిల్స్‌ను చెప్పుకొచ్చాడు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T17:04:56+05:30 IST