Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్.. అస్సలు మిస్ కాకూడని 5 అద్భుతమైన డీల్స్ ఇవే..!

ABN , First Publish Date - 2023-10-09T14:47:37+05:30 IST

అమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్ లో ఉన్న ఈ ఐదు ఆఫర్స్ చూశారంటే దిమ్మతిరిగిపోతుంది.

Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ స్టార్ట్.. అస్సలు మిస్ కాకూడని 5 అద్భుతమైన డీల్స్ ఇవే..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 8వ తేదీ నుండి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు మంచి డీల్స్ తో , గొప్ప డిస్కౌంట్‌ లో లభిస్తాయి. చాలావరకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నా ఇతర వస్తువుల మీద కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫెస్టివల్ సేల్ లో అస్సలు మిస్ చేసుకోకూడని ఐదు అద్భుతమైన డీల్స్ ఏంటో ఓ లుక్కేస్తే..

Samsung Galaxy Buds 2 Pro

sam.gif

సామ్ సంగ్ ఫ్లాగ్‌షిప్ ఇయర్‌బడ్‌లు. Galaxy Buds 2 Pro ఇప్పుడు అమెజాన్ లో రూ. 10,999కి అందుబాటులో ఉన్నాయి. SBI కార్డ్ వినియోగదారులు రూ. 8,099 తగ్గింపును పొందవచ్చు, ఈ తగ్గింపు తర్వాత ఈ ధర కేవలం రూ. 2,899 గా ఉంది. ఇవి బెస్ట్ TWS, యాపిల్ AirPods ప్రోతో సమానమైన నాణ్యత కలిగి ఉన్నాయి. సామ్ సంగ్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు Galaxy Buds 2 Pro అద్భుతమైన ఎంపిక.

Home Tips: పాత దుస్తులను పారేస్తున్నారా..? అయితే మీరు ఈ 7 విషయాలనూ తెలుసుకోవాల్సిందే..!



Samsung Galaxy Watch 4

watch.gif

వాకింగ్ చేసేటప్పుడు స్టెప్‌ కౌంట్ నుండి ఇతర నోటిఫికేషన్లను సమర్థవంతంగా చూపించగల స్మార్ట్ వాచ్ కోసం వెతుకుతున్నట్టైతే సామ్ సంగ్ స్మార్ట్ వాచ్ మంచి ఎంపిక అవుతుంది. ఇది మంచి నాణ్యతతో ఆండ్రాయిడ్ ఫోన్లకు మంచి సపోర్ట్ ఇస్తుంది. గెలాక్సీ వాచ్ 4 రూ. 7,999 లకు లభిస్తుంది. సామ్ సంగ్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్ గూగుల్ WearOS 4 లో రన్ అవుతుంది. ఇది గూగుల్ మ్యాప్స్, వాట్సప్ తో పాటు మరెన్నో వినియోగించడానికి వీలు కల్పిస్తుంది. గెలాక్సీ వాచ్ 4 ని ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌తోనైనా ఉపయోగించవచ్చు. కానీ యాపిల్ ఐఫోన్లకు ఇది సపోర్ట్ ఇవ్వదు.

Apple AirPods Pro (Gen 2)

apple.gif

ఇటీవల ఐఫోన్‌ని కొనుగోలు చేసి, AirPods ప్రో డీల్ కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి ఛాన్స్ వచ్చింది. అమెజాన్‌లో కేవలం రూ. 18,499కి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో2 అందుబాటులో ఉంది. దీని సాధారణ రేటు రూ. 24,000. SBI కార్డ్ ఉంటే దీనిమీద రూ. 1,500 అదనపు తగ్గింపును పొందవచ్చు.

Curry leaves: కరివేపాకులతో మీకు తెలియని లాభాలెన్నో.. కూరల్లో కాకుండా ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..!



Redmi Buds 4 Active

buds.gif

చౌకగా మంచి నాణ్యతతో కూడిన ట్రూ వైర్ లెస్ స్టీరియో(TWS) బడ్స్ కోసం వెతుకుతున్నవారికి Redmi Buds 4 Active చాలా బాగుంటుంది. కేవలం రూ. 899కే అమెజాన్ సేల్ లో అందుబాటులో ఉంది. Xiaomi నుండి లభిస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ ఇవి. తాజా బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉన్న ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Samsung T7 Shield 1TB

sheild.gif

పోర్టబుల్ ఎక్స్టర్నల్ SSD కోసం వెతుకుతున్నట్టేతే Samsung T7 షీల్డ్ (1TB) తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది కేవలం రూ. 6,999కి అమెజాన్ లో లభిస్తుంది. ఈ స్టోరేజ్ డ్రైవ్ USB-C టైప్ పిన్, USB-C కనెక్టర్‌తో వస్తుంది. ఇది PCలు, ల్యాప్‌టాప్‌లు, Android ఫోన్‌లతో మాత్రమే కాకుండా తాజా iPhone 15 Pro సిరీస్‌తో కూడా ఉపయోగించడానికి సపోర్ట్ చేస్తుంది.

Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!


Updated Date - 2023-10-09T14:47:37+05:30 IST