Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!

ABN , First Publish Date - 2023-10-09T10:00:16+05:30 IST

అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ దిగ్గజ సైట్లే అయినా ఒక్కోసైట్లో ఒకో విధంగా ఆఫర్స్ ఉంటాయి. ఈ సారి సేల్ లో భారీ డిస్కౌంట్ ఎందులోనంటే..

Flipkart vs Amazon: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఈ రెండింటిలో ఎక్కువ డిస్కౌంట్ ఎక్కడంటే..!

అతిపెద్ద ఈ-కామర్స్ సైట్లు మళ్లీ సేల్ తో సిద్దమైపోయాయి. ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సేల్.. సెప్టెంబర్ లో వినాయకచవితి సేల్.. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని, బిగ్ బిలియన్ డేస్ అని కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ సేల్ లో ల్యాప్టాప్ లు, టీవీలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మీద భారీగా డిస్కౌంట్ ఉండటంతో కస్టమర్లు కూడా తమకు నచ్చిన వస్తువులు కొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండూ దిగ్గజ సైట్లే అయినా ఒక్కోసైట్లో ఒకో విధంగా ఆఫర్స్ ఉంటాయి. ఈ సారి సేల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఐ ఫోన్లు నిలిచాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో ఎందులో ఐఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయో ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకుంటే..

యాపిల్ ఐ ఫోన్(Apple i phone) ఖరీదైన జీవితానికి ప్రతీక. చాలామంది యూత్ యాపిల్ ఐఫోన్ ను జీవితంలో ఖచ్చితంగా కొనాలని టార్గెట్ కూడా పెట్టుకుంటారు. ఆ పేరులో ఉన్న మ్యాజిక్ అలాంటిది. అయితే యాపిల్ ఐ ఫోన్లు ఈ పండుగ సేల్ లో మ్యాజిక్ డిస్కౌంట్లతో కస్టమర్ల మతి పోగొడుతున్నాయి. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్(Flipkart) లో వీటి మీద భారీ డిస్కౌంట్ సాగుతోంది.

Health Tips: ఆరోగ్యం మీద స్పృహతో ఉప్పు తక్కువ తింటుంటారా? ఈ నిజాలు తెలిస్తే..



ఐఫోన్ 11(i phone 11) ధర సాధారణంగా రూ. 37,999 ఉండేది. కానీ ఫ్లిప్కార్ట్ సేల్ లో ఇది రూ. 30వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అదే విదంగా ఐఫోన్ 12(i phone 12) ధర రూ. 48,999. కానీ ఫ్లిప్కార్ట్ లో మాత్రం 35వేలకే లభిస్తుంది.

ఐఫోన్ 13(i phone 13) అమెజాన్(Amazon) లో తక్కువ ధరకు లభిస్తోంది. గతంలో సేల్ జరిగినప్పుడు ఇది రూ.45,499కి అమ్ముడుపోయింది. కానీ ఇప్పుడు పండుగ సేల్ లో రూ. 39,999కి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఎక్స్చేంజ్ ఆఫర్(exchange offer) కింద రూ. 3500, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్(SBI bank card) కింద పేమెంట్ చేయడం వల్ల రూ.2500 డిస్కౌంట్ ఉంటాయి.

ఐఫోన్ 14(i phone 14) లాంచ్ చేసినప్పుడు దాని ధర రూ. 79,900. కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఇది కేవలం రూ.15,999కే సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇందులో ఉన్న లాజిక్ అర్థమైతే ఖరీదైన ఈ ఫోన్ ను తక్కువ ధరకే పొందవచ్చు. నిజానికి ఈ ఫోన్ ధర ఈ ఏడాదిలో రూ.52,999 పలికింది. ఫ్లిప్కార్ట్ క్రియేటివ్ టాస్క్ లను కంప్లీట్ చేయడం వల్ల దీని మీద రూ.3వేల వరకు తగ్గింపు ఉంటుంది. అప్పుడు దీని ధర రూ.49,999 అవుతుంది. ఇకపోతే గత ఏడాది ఐఫోన్ ప్రో మాక్స్ ను కొన్న కస్టమర్లు ఆ ఫోన్ తగినంత ఆకర్షణగా లేకపోవడం వల్ల అసంతృప్తి చెందుతున్నారు. అలాంటి వారు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఐపోన్ 14 మీద రూ. 34వేల వరకు తగ్గింపు పొందుతారు. దీంతో రూ.79,900 విలువ చేసే ఐఫోన్ 14 కేవలం రూ. 15,999లకే లభిస్తుంది.

Health Tips: బరువు తగ్గడం కష్టంగా అనిపిస్తోందా?.. ఉదయం లేవగానే ఇదొక్కటి తాగి చూడండి..


Updated Date - 2023-10-09T10:00:16+05:30 IST