Viral Video: ఎంత అవమానం.. ఓ యువతి బిస్కెట్లు ఇస్తుంటే ఆ కోతులన్నీ ఏం చేశాయో చూడండి..
ABN , Publish Date - Dec 16 , 2023 | 08:56 PM
సాధారణంగా రోడ్డు మీద ఎవైనా జంతువులు కనిపించినపుడు కొందరు వాటికి ఆహారం ఇస్తుంటారు. వీధి కుక్కలు, పిల్లులు, కోతులు మొదలైనవి కనిపించినపుడు వాటికి ఆహారం ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. ఆయా జంతువులు కూడా ఆ ఆహారాన్ని తీసుకుని తింటాయి.
సాధారణంగా రోడ్డు మీద ఎవైనా జంతువులు కనిపించినపుడు కొందరు వాటికి ఆహారం (Food) ఇస్తుంటారు. వీధి కుక్కలు, పిల్లులు, కోతులు మొదలైనవి కనిపించినపుడు వాటికి ఆహారం ఇవ్వడానికి కొందరు ఆసక్తి చూపుతుంటారు. ఆయా జంతువులు కూడా ఆ ఆహారాన్ని తీసుకుని తింటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. ఆ ఫన్నీ వీడియో సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటోంది (Monkey Videos).
saloni_satpute_official అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి కోతికి (Monkey) బిస్కెట్ ఇచ్చింది. కోతి ఆ బిస్కెట్‌ను తీసుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత వెనుక మరో కోతి వచ్చింది. దానికి ఆ యువతి బిస్కెట్ (Biscuits) ఇచ్చింది. కోతి ఆ బిస్కెట్ తీసుకుని వాసన చూసి కింద పడేసింది. ఆ కోతి వెనుక వచ్చిన మరికొన్ని కోతులు కూడా అలాగే బిస్కెట్లు తీసుకుని వాసన చూసి కింద పడేశాయి. ఓ వ్యక్తి ఫన్నీ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (Funny Video).
Viral Video: వీళ్లందరూ వచ్చింది రేషన్ కోసం కాదు.. ఉద్యోగాల కోసం.. వైరల్ అవుతున్న వీడియో!
ఆరు రోజుల క్రితం షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.73 కోట్ల మంది వీక్షించారు. పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా తమ స్పందనలను తెలియజేశారు. ``కోతులు చాలా అవమానించాయి``, ``అందమైన అవమానం``, ``ఎమోషనల్ డ్యామేజ్``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.