Snake: మూడేళ్ల పిల్లాడు ఏదో తింటున్నాడని గబగబా వచ్చిన నాయనమ్మ.. నోట్లో చచ్చిన పాము కనిపించడంతో షాక్.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!

ABN , First Publish Date - 2023-06-05T16:52:58+05:30 IST

సహజంగా పాములు అంటేనే హడలెత్తిపోతారు. వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. పైగా పాములు విషపూరితమైనవి. కాటు వేస్తే ప్రాణాలే పోతాయి.

Snake: మూడేళ్ల పిల్లాడు ఏదో తింటున్నాడని గబగబా వచ్చిన నాయనమ్మ.. నోట్లో చచ్చిన పాము కనిపించడంతో షాక్.. ఆస్పత్రికి తీసుకెళ్తే..!
Snake

సహజంగా పాములు అంటేనే హడలెత్తిపోతారు. వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. పైగా పాములు విషపూరితమైనవి. కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. అలాంటిది ఓ పిల్లోడు పామును రఫ్ఫాడించాడు. చేత్తో పట్టుకుని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

చాలా మట్టుకు జంతువులు మనుషులను చూసి భయపడుతుంటాయి. అలాగే మనుషులను చూస్తే వాటికి కూడా అలానే భయం ఉంటుంది. అయితే వాటి జోలికి వెళ్లనంత సేపు మనలను ఏమీ చేయవు.. కానీ కావాలని వాటిని ఇబ్బంది పెడితే మాత్రం వదిలిపెట్టవు. కానీ మూడేళ్ల పిల్లోడు ఓ పామును గోటి బిల్లా ఆడుకున్నట్లు ఆడుకున్నాడు. అంతేకాదు దాన్ని జంతికలు నమిలినట్లు నిమిలేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫరూఖాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

boy.jpg

ఫరూఖాబాద్‌ జిల్లాలోని మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి తన 3 ఏళ్ల కుమారుడితో (three year old boy) కలిసి ఉంటున్నాడు. శనివారం ఆడుకుంటుండగా బాలుడికి పాము కంటపడింది. అంతే ఎలాంటి భయాందోళన లేకుండా దాని దగ్గరకు వెళ్లి చేతులతో పట్టుకున్నాడు. అనంతరం దాన్ని నోటితో కొరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా నమిలిపడేశాడు (chewed a snake). ఆ తర్వాత బాలుడి ఆరోగ్యం విషమించి స్పృహతప్పి పడిపోయాడు. అప్రమత్తమైన నాయనమ్మ.. కుటుంబ సభ్యులు చనిపోయిన పాముతో పాటు బాలుడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో క్షేమంగా బయటపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

s2.jpg

ఇది కూడా చదవండి: Woman Kisses Snake: ఈ యువతి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోయింది.. పామును ముద్దు పెట్టుకున్న మరుక్షణంలోనే..!

ఇది కూడా చదవండి: Train Accident: రైలు పట్టాలపై దొరికిన డైరీలో ‘ప్రేమ కావ్యం..’.. ఆ భగ్న ప్రేమికుడు బతికి ఉన్నాడో.. లేదో.. తెలియదు కానీ..!

Updated Date - 2023-06-05T16:54:45+05:30 IST