Pushpa: వైరల్ వీడియో.. ‘సామీ సామీ’ సాంగ్‌కు స్కూల్ స్టూడెంట్ క్రేజీ స్టెప్స్..

ABN , First Publish Date - 2023-03-06T17:52:14+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన్నా (Rashmika Manddana) హీరోయిన్‌గా నటించారు. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) తెరకెక్కించారు. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Pushpa: వైరల్ వీడియో.. ‘సామీ సామీ’ సాంగ్‌కు  స్కూల్ స్టూడెంట్ క్రేజీ స్టెప్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన సినిమా ‘పుష్ప’ (Pushpa). రష్మిక మందన్నా (Rashmika Manddana) హీరోయిన్‌గా నటించారు. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) తెరకెక్కించారు. కరోనా కాలంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్‌లోను పబ్లిసిటీ లేకుండా విడుదలయింది. బన్నీ స్టామినా ఏంటో తెలుపుతూ ఈ సినిమా అక్కడ కూడా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ మూవీలోని సాంగ్స్ ఎంత హిట్టో అందరికి తెలిసిందే. ‘ఊ అంటవా మావా’, ‘సామీ సామీ’, ‘శ్రీ వల్లీ’ సాంగ్స్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి. ‘పుష్ప’ విడుదలై ఏడాది కావొస్తున్నా ఇప్పటికీ ఈ సాంగ్స్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని ‘సామీ సామీ’ (Saami Saami) పాటకు ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ గా మారింది.

‘సామీ సామీ’ పాటకు స్కూల్ యూనిఫాం ధ‌రించిన‌ ఓ విద్యార్ధిని క్రేజీ స్టెప్స్‌ వేసింది. బీట్‌కు తగ్గట్టుగా కాలు కదిపింది. చిన్నారి డ్యాన్స్కు తోటి విద్యార్థులు ఫిదా అయ్యారు. వారు కూడా కాలు కదిపారు. ఈ వీడియో మార్చి 4న సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపుగా 70వేల మంది వీక్షించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-06T17:53:56+05:30 IST