Snake Video: అతడి చుట్టూ అయిదు పాములు.. ఒక్కోదాన్ని రెచ్చగొడుతూ చెలగాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2023-06-24T16:22:11+05:30 IST

సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ఇతర జీవాలకు సంబంధించిన ఆసక్తికర వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఇటీవల తరచుగా దర్శనమిస్తున్నాయి.

Snake Video: అతడి చుట్టూ అయిదు పాములు.. ఒక్కోదాన్ని రెచ్చగొడుతూ చెలగాటం.. చివరకు జరిగిందేంటో మీరే చూడండి..!

సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజూ వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. ఇతర జీవాలకు సంబంధించిన ఆసక్తికర వీడియోలైతే బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు (Snakes) సంబంధించిన వీడియోలు ఇటీవల తరచుగా దర్శనమిస్తున్నాయి. ఇళ్లలోనూ, వాహనాల్లోనూ దాగి ఉన్న పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి (Snake Videos). ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి ఐదు విష సర్పాలతో ఆడుకుంటున్నాడు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ఐదు భయంకర విష సర్పాల ముందు కూర్చుని ఉన్నాడు (A Man playing with 5 king cobras). ఆ ఐదు పాములు పడగలు విప్పి భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఆ అయిదు సర్పాలను రెచ్చగొడుతూ వాటితో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ పాములు అతడిని కాటు వేయడానికి బుసలు కొట్టాయి. అతడు చాకచక్యంగా తప్పించుకుంటూ పాములను మరింత రెచ్చగొట్టాడు. ఆ తర్వాత తన రెండు చేతులతోనూ రెండు పాములను పట్టుకున్నాడు (Shocking Videos).

Snake Operation Video: ప్లాస్టిక్ మూతను మింగేసిన పాము.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు..!

ఆ తర్వాత ముందుకు వంగి మరో పామును తలపై ముద్దు పెట్టుకున్నాడు. Earth Reels అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భయంకర వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పాములతో పాటు ఆ వ్యక్తి కూడా చాలా భయంకరంగా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-24T16:22:11+05:30 IST