Snake Operation Video: ప్లాస్టిక్ మూతను మింగేసిన పాము.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు..!

ABN , First Publish Date - 2023-06-24T15:27:56+05:30 IST

ప్రపంచ పర్యావరణానికి ప్లాస్టిక్ ప్రస్తుతం పెను సవాలుగా మారింది. ఎవరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ భూతానికి మూగ జీవాలు బలి అయిపోతున్నాయి. తాజాగా ఓ పాము కూడా ప్లాస్టిక్ మూతను మింగేసింది. డాక్టర్లు ఆ పాముకు ఆపరేషన్ చేసి ప్లాస్టిక్ మూతను బయటకు తీశారు.

Snake Operation Video: ప్లాస్టిక్ మూతను మింగేసిన పాము.. ఆపరేషన్ చేసి బయటకు తీసిన డాక్టర్లు..!

ప్రపంచ పర్యావరణానికి ప్లాస్టిక్ (Plastic) ప్రస్తుతం పెను సవాలుగా మారింది. ఎవరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ భూతానికి మూగ జీవాలు బలి అయిపోతున్నాయి. ఆవులు, గేదెలు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాగే సముద్ర జీవుల గర్భాల్లో కూడా ప్లాస్టిక్ అధిక మొత్తంలో లభ్యమైనట్టు ఇటీవల కొన్ని పరిశోధనలు నిరూపించాయి. తాజాగా ఓ పాము కూడా ప్లాస్టిక్ మూతను మింగేసింది (King Cobra swallows plasstic Cup).

ఆ పాముకు డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ మూతను బయటకు తీశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Snake Videos) మారింది. ఆ వైరల్ వీడియోలో ఓ కింగ్ కోబ్రాకు మనిషికి చేసినట్టే ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేశారు. ముందుకు ఆ పాము పొట్టకు ఎక్స్-రే తీశారు. ఆ ఎక్స్-రే‌లో ప్లాస్టిక్ మూత స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆ పాముకు మత్తు ఇచ్చి, ఆక్సిజన్ మాస్క్ తగిలించి ఆపరేషన్ (Surgery) ప్రారంభించారు. ఆ తర్వాత పాము పొట్టను కోసి ప్లాస్టిక్ మూతను తీసేశారు (Snake Operation Video).

Amazing: ఇదెక్కడి వింత బాబోయ్.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే నాలుగేళ్ల తర్వాత చేరుకున్న పార్శిల్..!

పాము పొట్ట నుంచి మూతను తీసిన తర్వాత తిరిగి కుట్లు వేశారు. ఈ ఆపరేషన్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 7 వేల మందికి పైగా ఆ వీడియోను చూశారు. ఆపరేషన్ చేసిన వైద్యులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-06-24T15:27:56+05:30 IST