7 Bad Habits: ఈ 7 చెడు అలవాట్లే మీ శరీరాన్ని రోగాలకు నిలయంగా చేస్తున్నాయని తెలుసా..? షుగర్ నుంచి గుండె సమస్యల వరకు..!

ABN , First Publish Date - 2023-10-04T12:33:47+05:30 IST

చాలామందికి లైఫ్ స్టైల్ లో సాధారణంగా ఉన్న కొన్ని అలవాట్లే వారి ఆరోగ్యం పాలిట శత్రువులుగా మారుతున్నాయ్..

7 Bad Habits: ఈ 7 చెడు అలవాట్లే మీ శరీరాన్ని రోగాలకు నిలయంగా చేస్తున్నాయని తెలుసా..? షుగర్ నుంచి గుండె సమస్యల వరకు..!

ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కానీ ఆరోగ్యం గురించి గత కొన్నేళ్ళ నుండి ఏర్పడిన ఆందోళన అంతా ఇంతా కాదు. చాలామందికి లైఫ్ స్టైల్ లో సాధారణంగా ఉన్న కొన్ని అలవాట్లే వారి ఆరోగ్యం పాలిట శత్రువులుగా మారుతున్నాయంటే అవి ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యలతో పాటు శరీరాన్ని రోగాల పుట్టగా మారుస్తున్నాయి. ఈ 7 అలవాట్లు ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఉంటడం ఎంతో అవసరం. అవేంటో తెలుసుకుంటే..

శారీరక శ్రమ లేకపోవడం.. (Physical activity)

శారీరక శ్రమ లేకపోవడం అనేక వ్యాధులకు కారణమవుతుంది. శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది, దీని కారణంగా పోషకాలు సరిగా గ్రహించబడవు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఇది ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన..(stress, depression, anxiety)

నేటికాలం యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే. వీటి కారణంగా శరీరంలో 1500రకాల బయోకెమికల్స్ క్షీణించిపోతాయి. ఒత్తిడి కారణంగా రక్తపోటు సమతుల్యత దెబ్బతింటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం , వ్యాయామం, ధ్యానం మొదలైనవి ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

Viral Video: బాబోయ్.. ఇదేం పిచ్చి పని..? ప్రియుడి చేతిని కొరికిన ప్రేయసి.. గాట్లు పడిన తర్వాత అతడేం చేశాడో చూస్తే..!



నిద్రలేకపోవడం..(insomnia)

నిద్రను గొప్ప ఔషదంగా చెబుతారు. సరిపడినంత నిద్ర ఉంటే ఆ మనిషి శరీర ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. కానీ నిద్రసరిగా లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి పెరుగుతుంది.

కూరగాయలు, పండ్లు తగినంత లేకపోవడం..(low fruits, vegetables)

ఆకలి వేయగానే పిజ్జాలు, బర్గర్ లు, పానీ పూరి, ఫాస్ట్ ఫుడ్, ఆన్లైన్ ఆర్డర్లలో మునిగి తేలుతున్న కాలమిది. దీనికారణంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు సరిపడినంత తీసుకోవడం లేదు. శరీరానికి కావలసిన ఫైబర్ వీటి నుండే లభ్యమవుతుంది. వాటిని తీసుకోకపోవడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మధుమేహానికి దారితీస్తుంది.

ధూమపానం, మద్యపానం..(smoking, drinking)

సిగరెట్లు, మందు తీసుకోవడం నేటి కాలం వారికి ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను పెంచుతాయి. ఇవి జీవనశైలి మొత్తాన్ని దెబ్బతీస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెంచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని 10రెట్లు పెంచుతాయి.

అల్పాహారం స్కిప్ చేయడం..(breakfast skip)

రోజు మొత్తం యాక్టీవ్ గా పనిచేయాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యమని ఆహార నిపుణులు ఎప్పటినుండో చెబుతున్నారు. దీన్ని స్కిప్ చేయడం చాలా చెడ్డ అలవాటు . టిఫిన్ స్కిప్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఉదయం నిద్రలేచిన గంటలోపు ఏదో ఒకటి తినాలి.

కృత్రిమ చక్కెరలు..(artificial sugars)

మార్కెట్లో లభించే ఎన్నో రకాల శీలత పానీయాలలో కృత్రిమ చక్కెరలు ఉంటాయి. ఇవి రక్తంలో కరగని చక్కెరలుగా మిగిలిపోతాయి. ఇవి మధుమేహం, రక్తపోటు సమస్యలకు ప్రధాన శత్రువు. కృత్రిమ చక్కెరలున్న ఏ పానీయాలను, ఆహారాలను తీసుకోకపోవడం మంచిది.

Viral Video: ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు.. ఈ మహిళ టీ ని ఎలా తయారు చేసిందో చూస్తే..!


Updated Date - 2023-10-04T12:33:47+05:30 IST