AP Politics: పీవీ రమేష్ కులంపై తప్పుడు ప్రచారం.. అసలు ఆయన ఎవరు?

ABN , First Publish Date - 2023-09-13T17:57:40+05:30 IST

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో దొంగ కేసు పెట్టి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయటం కరెక్టు కాదని పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు సీఐడీ అధికారుల గాలిని తీసేశాయి. అంతేకాకుండా పీవీ రమేష్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతో కొందరు ఆయనకు కులం రంగు పులిమే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

AP Politics: పీవీ రమేష్ కులంపై తప్పుడు ప్రచారం.. అసలు ఆయన ఎవరు?

ఏపీ ఆర్ధిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన వాంగ్మూలం ఆధారంగానే చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారాన్ని పీవీ రమేష్ స్పందించి స్వయంగా ఖండించారు. అంతేకాకుండా జగన్ బినామీలకు పెట్టుబడులు ఉన్నందున మేఘా ఇంజినీరింగ్ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. తన కెరీర్‌లో రాజకీయాలు, సామాజిక, ఆర్థిక, వ్యాపార ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజల కోసమే తాను పని చేశానని పీవీ రమేష్ స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విషయంలో దొంగ కేసు పెట్టి మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేయటం కరెక్టు కాదని పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు సీఐడీ అధికారుల గాలిని తీసేశాయి. అంతేకాకుండా పీవీ రమేష్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతో కొందరు ఆయనకు కులం రంగు పులిమే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు వైసీపీకి చెందిన కొందరు పీవీ రమేష్ కమ్మ కులానికి చెందినవారుగా ప్రచారం ప్రారంభించాడు. చంద్రబాబుకు, రామోజీరావుకు పీవీ రమేష్ చాలా దగ్గర వ్యక్తి అని.. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా.. ఆయనకు మద్దతుగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నట్లు విషప్రచారం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్‌లు మండిపడుతున్నారు. ఇలాంటి వాళ్లు సమాజానికి చీడపురుగుల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: NCBN Arrest: తెలుగు సినీ ప్రముఖులకు ఏమైంది? ఎందుకు స్పందించడం లేదు?

అసలు పీవీ రమేష్ కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన ఎస్సీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. చంద్రబాబు హయాంలో ఆర్ధిక శాఖలో పనిచేసిన ఆయన.. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలు నిర్వహించారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన మేఘా ఇంజినీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన జీతం నెలకు రూ.8 లక్షలకు పైగా ఉంటుంది. జగన్‌కు మేఘారెడ్డి సన్నిహితుడు కావడంతో ఆయనపై ఆరోపణలు చేసి ఉద్యోగంలో కొనసాగడం ధర్మం కాదని భావించి రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకున్నారు. అనంతరం ప్రెస్‌మీట్ పెట్టి ఏపీ ప్రభుత్వ తీరుపై పీవీ రమేష్ ఆరోపణలు చేశారు. అధికారుల్లో నీతికి, న్యాయానికి కట్టుబడే వారు ఉంటారని, ఇలాంటి అధికారులను చూసినపుడు సంతోషం వేస్తుందని పలువురు నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. కాగా పీవీ రమేష్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసంతా నడవలేదని సీఐడీ వర్గాలు స్పందించాయి. దర్యాప్తు ప్రక్రియలో పీవీ రమేష్ స్టేట్ మెంట్ ఒక భాగం మాత్రేమేనని సీఐడీ స్పష్టం చేసింది.

Updated Date - 2023-09-13T18:27:30+05:30 IST