Share News

Hyd Metro : చంద్రబాబు మద్దతుదారులపై పోలీసుల ఓవరాక్షన్.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2023-10-14T12:38:23+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu) అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగాలు భారీగా నిరసన చేపట్టారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైలులో (Hyderabad Metro) ఎక్కడ చూసినా ‘బాబుకోసం మేముసైతం’ అంటూ నల్ల డ్రస్సుతో జనాలు శాంతియుతంగా నిరసన చేశారు. ..

Hyd Metro : చంద్రబాబు మద్దతుదారులపై పోలీసుల ఓవరాక్షన్.. ఎందుకిలా..!?

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (Chandra Babu) అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగాలు భారీగా నిరసన చేపట్టారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో రైలులో (Hyderabad Metro) ఎక్కడ చూసినా ‘బాబుకోసం మేముసైతం’ అంటూ నల్ల డ్రస్సుతో జనాలు శాంతియుతంగా నిరసన చేశారు. అయితే.. హైదరాబాద్ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. బాబు మద్దతుదారులపై ఖాకీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ బాబు మద్దుతుదారులను అడ్డుకోవడం.. పలుచోట్ల వారిపైన దాడిచేయడం.. పోలీస్ స్టేషన్లకు తరలించడం చేస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఎక్కడ చూసినా హైటెన్షన్ నెలకొంది.


Metro.jpg

ఎందుకిలా...?

బ్లాక్ షర్ట్స్ ధరించి ప్రయాణిస్తున్న సామాన్యులపై కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. మరోవైపు.. పోలీసుల దాడిలో పలువురు చంద్రబాబు మద్దతుదారులకు గాయాలయ్యాయి. పోలీసుల అణిచివేతపై బాబు మద్దతుదారులు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. మెట్రో స్టేషన్లలోనే కాదు.. రైళ్ళలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద ట్రైన్లన్నీ పోలీసులు నిలిపేశారు. కొన్ని చోట్ల మెట్రోలో ప్రయాణిస్తున్న వారిపై పోలీసులు దాడులు చేస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్లాక్ షర్ట్స్ ధరించిన వారిని పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం గమనార్హం.

Police.jpeg

వస్తాం.. వెళ్తాం మీకేంటి..?

ఆంధ్రలో సైకో జగన్ పోవాలి.. సైకిల్ రావాలి అనే నినాదంతో బాబు మద్దతుదారులు నిరసనకు దిగారు. పరిపాలన చేతకాని సీఎం వైఎస్ జగన్‌తో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం మెట్రో దరిదాపుల్లో ఉండొద్దని హెచ్చరిస్తుండటంతో ‘మెట్రోలో వచ్చిన వాళ్ళం.. మెట్రోలోనే వెళ్తాం.. మీకొచ్చిన ఇబ్బందేంటి..?’ అని పోలీసులతో బాబు మద్దతుదారులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు.. ఇప్పుడిప్పుడే మెట్రోరైలులో ఎల్బీనగర్‌కు చేరుకుంటున్న పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు చేరుకుంటున్నారు. మరోవైపు.. ఎల్బీనగర్‌లో రోడ్లపై వచ్చిన చంద్రబాబు మద్దతుదారులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడంతో పులువురు బాబు ఫాలోవర్స్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా రోడ్లపైనే ఆందోళన చేపడుతున్నారు.

Police Over Action.jpg

బ్లాక్ కనిపిస్తే చాలు..!

చంద్రబాబుకు మద్దతుగా మియాపూర్ నుంచి అమీర్‌పేట మెట్రోస్టేషన్ వరకూ నల్ల టీషర్టులతో ప్రయాణిస్తున్న 47 మందిని పోలీసులు గుర్తించి దించేశారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొట్టుకుంటూ.. బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమీర్‌పేట మెట్రో స్టేషన్ ఇంటర్ ఛేంజ్ కావడంతో ఇక్కడికి ఎవరొచ్చినా వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్‌పేట మెట్రోస్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాబు మద్దతుదారులను మాత్రమే కాదు.. బ్లాక్ టీ షర్టులు ధరించి ప్రయాణిస్తున్న సామాన్యులను సైతం అరెస్ట్ చేస్తుండటంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మెట్రో స్టేషన్లన్నీ చంద్రబాబు మద్దతుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో అమీర్‌పేట్, ఎంజీబీఎస్ దగ్గర మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఈ ఆందోళనల నడుమ మెట్రో సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆ మధ్య చంద్రబాబుకు మద్దతుగా కారు, బైక్ ర్యాలీలు చేస్తే అనుమతించకపోవడం.. ఇప్పుడు నిరసనకు అవకాశం ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై బాబు ఫాలోవర్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Lets-Metro.jpg


ఇవి కూడా చదవండి


CBN Arrest : చంద్రబాబుకు మద్దతుగా నిరసన.. హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో హైటెన్షన్!


NCBN Health : హుటాహుటిన హస్తిన నుంచి రాజమండ్రికి లోకేష్.. ఏం జరుగుతోంది..!?



Updated Date - 2023-10-14T12:51:09+05:30 IST