CM KCR: కర్ణాటకను వదిలేసి మహారాష్ట్రపైనే కేసీఆర్ ఎందుకు ఫోకస్ చేశారు..మరేదైనా రీజన్ ఉందా?

ABN , First Publish Date - 2023-03-31T09:53:58+05:30 IST

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలపిస్తోన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా

CM KCR: కర్ణాటకను వదిలేసి మహారాష్ట్రపైనే కేసీఆర్ ఎందుకు ఫోకస్ చేశారు..మరేదైనా రీజన్ ఉందా?

కర్ణాటకలో కారు పార్టీకి స్పందన కరువైందా? త్వరలో సాధారణ ఎన్నికలు జరిగే ఆ రాష్ట్రం వైపు.. బీఆర్ఎస్‌ అధిపతి ఎందుకు చూడటం లేదు? మహారాష్ట్రలో వరుస సభలు పెడుతున్న కేసీఆర్.. కర్ణాటకలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? ఫ్రెండ్లీ పార్టీ జేడీఎస్ చీఫ్.. కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చారా? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-505.jpg

కర్ణాటకలో రెండు చేరికల సభలు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తలపిస్తోన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి పెట్టారు. పక్క రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులను కారెక్కించడం మీద కాన్సంట్రేట్ చేశారు. అందులో భాగంగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, శశీర్ గమాంగ్, ఆంధ్రప్రదేశ్ నుంచి తోట చంద్ర శేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వంటి వారు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే వారంతా హైదరాబాద్‌కే వచ్చి కండువా కప్పుకున్నారు. కానీ.. ఇతర రాష్ట్రాల నుంచి చేరికలకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. తెలంగాణ బయట ఒక్క మహారాష్ట్రలో మాత్రం జాయినింగ్స్ పేరిట కేసీఆర్ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రెండు చేరికల సభలు నిర్వహించారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో, మార్చి26న కాందార్ లోహలో సభలు పెట్టారు. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Untitled-60.jpg

బీఆర్ఎస్‌లో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా?

అయితే.. మహారాష్ట్రకు దౌడు తీస్తున్న కారు.. కర్ణాటకకు ఎందుకు వెళ్లడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా జరుగుతోంది. అక్కడ చేరడానికి ఎవరు ముందుకు రావడం లేదా? అందుకోసం కేసీఆర్ ప్రయత్నం చేయడం లేదా..? కేసిఆర్ కర్ణాటక వెళ్లకపోవడానికి మరేదైనా రీజన్ ఉందా? త్వరలో శాసనసభకు ఎన్నికలు జరిగే కర్ణాటకను వదిలేసి.. మహారాష్ట్ర పైనే కేసీఆర్ ఎందుకు ఫోకస్ చేశారన్నది.. చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అక్కడ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. పార్టీలు ఎలక్షన్ క్యాంపైన్ స్టార్ట్ చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్‌లో కర్ణాటక ఎన్నికలపై చడీ చప్పుడు లేదు. ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా.. కేసీఆర్ అక్కడ సభలు పెట్టడం లేదు. ఎవరిని చేర్చుకోవడం లేదు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ.. తమ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని ప్రకటించిన కేసీఆర్ మరీ ఇప్పుడెందుకు వెనక్కి తగ్గారనేది ఆసక్తి రేపుతోంది.

Untitled-80.jpg

బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసే విషయంలో యూటర్న్‌!

దేవేగౌడ పార్టీ జేడీఎస్‌తో పొత్తు కన్ఫార్మ్ అయిందని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ గతంలో సంకేతాలు ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏపి, తెలంగాణ కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో 50 స్థానాలు తగ్గకుండా గులాబీపార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. కర్ణాటకలోని మిగతా నియోజకవర్గాల్లో జేడీఎస్‌కు కారు పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ అధికారిక ప్రకటన కార్యక్రమంలో కేసీఆర్ పార్టీ నేతలకు కర్ణాటకలో పోటీపై క్లారిటీ ఇచ్చారు. జేడీఎస్ అధినేత కుమార స్వామి సైతం మొదట్లో కేసీఆర్ ప్రతిపాదనకు జై కొట్టారు. బీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పిలిచినప్పుడల్లా వచ్చి కేసీఆర్‌కు సపోర్ట్ చేశారు. కానీ ఆ తర్వాత బిఆర్ఎస్‌తో కలిసి పనిచేసే విషయంలో కుమారస్వామి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో కేసీఆర్ పిలిచిన ప్రతిచిన్న కార్యక్రమానికి అటెండ్ అయిన కుమారస్వామి ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాకుండా హ్యాండ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇటు వైపు చూడటం లేదు. దాంతో జేడీఎస్ సపోర్ట్‌తో కర్ణాటకలో అడుగు పెట్టాలని ఆశించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌కు పరిస్థితులు కలిసి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

Untitled-90.jpg

బలం లేని బీఆర్ఎస్‌ కంటే కాంగ్రెస్‌తో వెళ్తే బెటర్‌!

గతంలో కర్ణాటకలో కాంగ్రెస్‌తో కలిసి జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి కర్ణాటక సీఎంగా పనిచేశారు. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం పదవిని కోల్పోయారు. కర్ణాటకలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాత కుమారస్వామి మనసు మార్చుకున్నట్లు టాక్. కర్ణాటకలో అసలు బలం లేని బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్‌తో వెళితే బెటర్ అని కుమారస్వామి ఆలోచిస్తున్నారట. కేసీఆర్ పార్టీని పోటీకి ఆహ్వానిస్తే అది బీజేపీకి మేలుచేస్తుందని అది ఇష్టం లేకే.. కర్ణాటకలో బీఆర్ఎస్ ఎంట్రీకి కుమారస్వామి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న కర్ణాటక ప్రాంతంలోనూ బీఆర్ఎస్ పోటీ చేయవద్దని కేసిఆర్‌ను కుమార స్వామి కోరినట్టు సమాచారం. అందుకే కేసీఆర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వైపు చూడడం లేదని తెలుస్తోంది. శాసన సభ ఎన్నికల అనంతరం పార్లమెంట్ కోసం కర్ణాటకలోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పుడు జేడీఎస్ పార్టీ మద్దతు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Updated Date - 2023-03-31T09:53:58+05:30 IST