Share News

CBN Release : చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చిన ఆ ఇద్దరెవరు..?

ABN , First Publish Date - 2023-11-01T08:54:21+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి..

CBN Release : చంద్రబాబుకు ష్యూరిటీ ఇచ్చిన ఆ ఇద్దరెవరు..?

  • ఏసీబీ కోర్టుకు వచ్చిన దేవినేని, బొండా

  • చెరో రూ.లక్ష పూచీకత్తు సమర్పణ

విజయవాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ష్యూరిటీలు సమర్పించడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు రాగానే వారు ఏసీబీ కోర్టుకు వచ్చారు. ఇద్దరూ చెరో రూ.లక్ష చెల్లించి, ష్యూరిటీలను సమర్పించారు. తర్వాత న్యాయాధికారి హిమబిందు వారిని ప్రశ్నించారు. ఇద్దరి పేర్లూ అడిగారు. ఎవరికి ష్యూరిటీ ఇస్తున్నారో తెలుసా అని ప్రశ్నించగా చంద్రబాబుకు అని వారు సమాధానం చెప్పారు. ష్యూరిటీగా ఎంత మొత్తం చెల్లించారని ప్రశ్నించగా రూ.లక్ష చెల్లించామని సమాధానమిచ్చారు. అనంతరం కోర్టు బయట వారు మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబుపై జగన్‌ అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం జరుగుతోందన్నారు. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌, హైకోర్టులో రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరుగుతోందని చెప్పారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందన్నారు.


ap-high-court.jpg

శిక్ష పడేలా చేస్తాం!!

జగన్‌ తప్పుడు ఆధారాలతో ఆయన్ను జ్యుడీషియల్‌ రిమాండ్‌లో పెట్టించారు. రాజకీయ క్రీడలో భాగంగానే అరెస్టు చేశారు. న్యాయం, ధర్మం గెలిచి చంద్రబాబు బయటకు వస్తున్నారు. న్యాయస్థానాల ద్వారా జగన్‌కు శిక్ష పడేలా చూస్తాం. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే అడ్డుకున్నారు. తల్లి అనారోగ్యంగా ఉందని చెప్పి ఆయన్ను కాపాడారు. పోలీసులు అవినాశ్‌రెడ్డికి అండగా నిలిచారు. చంద్రబాబు మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని మరో కేసు నమోదు చేశారు. మద్యం ద్వారా లక్ష కోట్లు దోచుకుని జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో దాచుకున్నారు. అంగళ్లులో వైసీపీ నేతలు గొడవ చేస్తే చంద్రబాబుపై కేసు పెట్టారు. రోడ్డు లేని ఇన్నర్‌ రింగ్‌రోడ్డుపై కేసు నమోదు చేశారు. గౌతమ్‌రెడ్డితో ఫైబర్‌ నెట్‌ స్కాం కేసు పెట్టించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా న్యాయం గెలుస్తుందన్నారు. భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా నిజమే గెలించిందిఅని తెలిపారు.

Untitled-3.jpg

బాబుపై మరో కేసు పెట్టారని..

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు పెట్టిందన్న సమాచారంతో నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలోని విక్కిరాలపేటకు చెందిన మల్లెబోయిన నారాయణ(55) కుప్పకూలి మృతిచెందాడు. కాగా, చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందో, రాదోనని భావోద్వేగానికి గురై చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పి.కొత్తకోట పంచాయతీ మోటకంపల్లెకు చెందిన ఎన్‌.బాబు నాయుడు(63) మంగళవారం ఉదయం ఛాతీ నొప్పితో మృతిచెందారు.

Updated Date - 2023-11-01T08:56:32+05:30 IST