Share News

CBN Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చు..!?

ABN , First Publish Date - 2023-10-17T20:07:01+05:30 IST

తీర్పు ఎప్పుడు రావొచ్చు..? సుప్రీంలో ఇవాళ జరిగిన వాదనలు చంద్రబాబుకు ఊరటనిస్తాయా..? ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలను సాగదీశారు..? తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులిస్తుంది..?..

CBN Skill Case : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చు..!?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) మంగళవారం నాడు సుప్రీంకోర్టులో సుదీర్ఘం విచారణ జరిగింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాడివేడిగా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను నిశితంగా విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేస్తూ.. తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఇంతవరకూ ఓకేగానీ.. తీర్పు ఎప్పుడు రావొచ్చు..? సుప్రీంలో ఇవాళ జరిగిన వాదనలు చంద్రబాబుకు ఊరటనిస్తాయా..? ప్రభుత్వ న్యాయవాది ఎందుకు వాదనలను సాగదీశారు..? తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఎప్పుడు ఉత్తర్వులిస్తుంది..? చంద్రబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..? త్వరలో రానున్న తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో, తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పలువురు న్యాయ నిపుణులు, కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


supreme-(2).jpg

న్యాయ నిపుణులు ఏమంటున్నారు..?

స్కిల్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఈ వారం కష్టమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంగళవారం నాటి ఇరువర్గాల వాదనలను పరిశీలించడానికి ధర్మాసనానికి మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉందని.. దీన్ని బట్టి చూస్తే శుక్రవారం కూడా తీర్పు రాకపోవచ్చని, మళ్లీ వాయిదాపడే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయని నిఫుణులు చెబుతున్న మాట. వచ్చే సోమవారం లేదా మరికొన్ని రోజులు విచారణ వాయిదా పడినా పడొచ్చని తెలియవచ్చింది. మరోవైపు.. ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి దీన్ని సాకుగా చూపి తీర్పు మరికొంత ఆలస్యమయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. అయితే.. మంగళవారం నాడు జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే అద్భుతమైన వాదనలు వినిపించారనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఆయన ఉదహరించిన పలు కేసులు, వాదనల గురించే ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. కచ్చితంగా చంద్రబాబుకు అంతా మంచే జరుగుతుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

cbn bail.jpg

రాజకీయ నేతలు ఏమంటున్నారు..?

శుక్రవారం నాడు స్కిల్‌తో పాటు ఫైబర్ నెట్ కేసులపై కూడా విచారణ శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. వాస్తవానికి ఇవాళ కీలక తీర్పు వస్తుందని.. అది చరిత్రలో నిలిచిపోయే తీర్పని కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ తీర్పు ఎలా ఉంటుందా అని తెలుగుదేశం శ్రేణులు, ప్రజలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుండిపోయారు.. కానీ విచారణ వాయిదా అనే వార్తలతో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు.. ఈ విచారణపై టీడీపీ నేతలు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు స్పందించారు.

raghurama-mp.jpg

మరింత ఆలస్యం..!

చంద్రబాబు కేసులో ఇరువర్గాల వాదనలు పూర్తయ్యాయి. ముకుల్ అవే వాదనలు మళ్ళీ కొనసాగించారు.. విషయం లేదు. లిఖితపూర్వకంగా వాదనలు కూడా శుక్రవారం ఇస్తామన్నారు. 40 రోజుల నుంచి బాబు జైల్లో ఉన్నారని కూడా సాల్వే చెప్పారు. 17A వర్తించకపోతే ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయని ముకుల్ అన్నారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఉంది.. దీన్ని సాకుగా చూపి మరికొంత ఆలస్యం అవ్వొచ్చు. కేసులో విషయం లేకపోయినా సమయాన్ని పొడిగించారు. జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో లేదు. మధ్యంతర బెయిల్ అడగడం తప్ప ఏమీ చేయలేము. ఎప్పుడైనా తీర్పు చంద్రబాబుకు అనుకూలంగానే వస్తుంది. సాల్వే అద్భుతంగా వాదించారు.. తీర్పు రావడం ఖాయంఅని ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు. సుప్రీం తీర్పుపై మాత్రం సర్వత్రా ఆసక్తి.. అంతకుమించి టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ అయితే కనిపిస్తోంది. అయితే.. తప్పకుండా చంద్రబాబుకు న్యాయమే జరుగుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఏం జరుగుతుందో..? తుది తీర్పు ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి మరి.

CBN.jpg


ఇవి కూడా చదవండి


CBN Skill Case : స్కిల్ కేసుపై చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం ఇదీ..


CBN Arrest : ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. ‘స్కిల్’ సంగతేంటో..!?


Updated Date - 2023-10-17T20:16:35+05:30 IST