BRS MLA Candidates : బహిరంగ సభలో బిగ్ షాకిచ్చిన కేటీఆర్.. నో చెప్పేసినట్టే.. అంతా అయోమయం..!

ABN , First Publish Date - 2023-06-17T22:06:52+05:30 IST

అవును.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఊహించని షాకిచ్చారు.. నియోజకవర్గాల పర్యటనలో ఈ మధ్య అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న ఇవాళ బహిరంగ సభలో విచిత్ర ప్రకటన చేశారు.. ఆయన మాటలు విన్న సభికులు, కార్యకర్తలు కంగుతిన్నారు.. బాబోయ్ సారేంటి ఇంత మాట అనేశారు..?..

BRS MLA Candidates : బహిరంగ సభలో బిగ్ షాకిచ్చిన కేటీఆర్.. నో చెప్పేసినట్టే.. అంతా అయోమయం..!

అవును.. తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఊహించని షాకిచ్చారు.. నియోజకవర్గాల పర్యటనలో ఈ మధ్య అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్న ఇవాళ బహిరంగ సభలో విచిత్ర ప్రకటన చేశారు.. ఆయన మాటలు విన్న సభికులు, కార్యకర్తలు కంగుతిన్నారు.. బాబోయ్ సారేంటి ఇంత మాట అనేశారు..? ఇక టికెట్ కష్టమేనా..? అనేలా పరిస్థితులు నెలకొన్నాయ్.. ఈ వ్యవహారం ఇప్పుడు బీఆర్ఎస్‌లో, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. అసలు కేటీఆర్ ఏమన్నారు..? ఇవాళ ఉదయం నుంచి ఆయన చేసిన ప్రకటనలు ఏంటి..? అనే విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంలో చూద్దాం..

BRS.jpg

ఇదీ కేటీఆర్ ప్రకటన..

బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలు, నియోజకవర్గాల పర్యటన, జిల్లాల పర్యటనలో ఓ వైపు సీఎం కేసీఆర్ (CM KCR).. మరోవైపు కీలక మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు (KTR, Harish Rao) అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సుమారు 17 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. శనివారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. ఇవాళ ఉదయం పరకాల (Parakala) నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharma Reddy) టికెట్‌పై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అయితే సాయంత్రం వరంగల్ తూర్పు నియోజకవర్గసభలో (Warangal East Assembly constituency) బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కు (Nannapaneni Narender) మంత్రి షాకిచ్చారు. టికెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వని కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం ఉంటేనే నరేందర్‌ ఎమ్మెల్యే అవుతారని వ్యాఖ్యానించారు. నరేందర్ టికెట్‌పై క్లారిటీ ఇవ్వకపోగా.. కేటీఆర్‌ ఇలా విచిత్ర ప్రకటన చేసేసరికి నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కేటీఆర్‌ నోట టికెట్ ప్రకటన చేయించుకునేందుకు నరేందర్ ఈ మధ్యనే భారీగా ఖర్చుచేశారు. ఇంతచేసినా తనకు కేటీఆర్ సభా వేదికగా టికెట్ ప్రకటిస్తారని ఆశించిన నరేందర్ భంగపడ్డారు. ఇప్పటికే భూపాలపల్లి, వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు క్లారిటీ ఇచ్చి.. వరంగల్ తూర్పు టికెట్‌పై కేటీఆర్ స్పష్టత ఇవ్వకపోవడంతో క్యాడర్ అయోమయంలో పడింది.

KTR-Sabha.jpg

సడన్‌గా ఎందుకిలా..?

కేటీఆర్ మాటలకు అర్థమేంటో జనాలకు తెలియని పరిస్థితి. అంటే.. కేసీఆర్ ఆశీర్వాదం నన్నపనేని నరేందర్‌కు లేదని పరోక్షంగా చెబుతున్నారా..? లేకుంటే నరేందర్ స్థానంలో వేరే వ్యక్తిని బరిలోకి దింపుతున్నామని చెబుతున్నారా..? అనేది అర్థం కాక నియోజకవర్గ కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు, నరేందర్ అనుచరులు జుట్టు పీక్కుంటున్నారట. ప్రకటన రావాల్సిన టైమ్‌లో వస్తుందని ఒక్క మాట చెప్పి ఉన్నా హ్యాపీగా ఉండేది కానీ.. సార్ సడన్‌గా ఇలా షాకివ్వడంతో తీవ్ర అసంతృప్తితో నరేందర్ రగిలిపోతున్నారట. వాస్తవానికి ఇప్పటికే కేసీఆర్ రహస్య సర్వే నిర్వహించారని.. జులై 15న 80 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో తొలి జాబితా ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో అసలు తమ పేరు ఉంటుందో లేదో.. పేరు లేకపోతే పరిస్థితేంటి..? అని చాలా మంది సిట్టింగుల్లో టెన్షన్ మొదలైంది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ ఇలాంటి ప్రకటన చేయడంతో నరేందర్ పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Nannapaneni-Narender-Reddy.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS Congress : తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. ఈ పెను సవాళ్ల సంగతేంటి.. ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

******************************

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

******************************
TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!


******************************

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

******************************

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?
******************************

AP Police : ఆనంపై అటాక్.. ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై పోలీసుల కామెడీ కథలు.. నమ్మకం లేదు దొరా..!

******************************

Updated Date - 2023-06-17T22:09:38+05:30 IST