AP Police : ఆనంపై అటాక్.. ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై పోలీసుల కామెడీ కథలు.. నమ్మకం లేదు దొరా..!

ABN , First Publish Date - 2023-06-16T18:43:17+05:30 IST

ఏపీలో జరిగిన రెండే రెండు ఘటనలు.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఈ రెండింటిపై పోలీసులు చెప్పిన కహానీలు వింటే బాబోయ్ వీళ్ల కన్నా దొంగలే నయం బాబోయ్ అనేంతలా ఆశ్చర్యపోతారేమో..! ఎందుకింతలా ఏపీ పోలీసుల (AP Police) గురించి చెప్పాల్సి వస్తోందంటే ఆ మధ్య టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై (Anam Venkata Ramana Reddy) జరిగిన దాడికి యత్నం.. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ (MP MVV Family Kidnap) వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కారణాలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవు...

AP Police : ఆనంపై అటాక్.. ఎంపీ ఎంవీవీ ఫ్యామిలీ కిడ్నాప్‌పై పోలీసుల కామెడీ కథలు.. నమ్మకం లేదు దొరా..!

ఏపీలో జరిగిన రెండే రెండు ఘటనలు.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతున్నాయి.. ఈ రెండింటిపై పోలీసులు చెప్పిన కహానీలు వింటే బాబోయ్ వీళ్ల కన్నా దొంగలే నయం బాబోయ్ అనేంతలా ఆశ్చర్యపోతారేమో..! ఎందుకింతలా ఏపీ పోలీసుల (AP Police) గురించి చెప్పాల్సి వస్తోందంటే ఆ మధ్య టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై (Anam Venkata Ramana Reddy) జరిగిన దాడికి యత్నం.. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ (MP MVV Family Kidnap) వ్యవహారంపై పోలీసులు చెబుతున్న కారణాలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవు. లోతుగా దర్యాప్తు చేసి.. అసలేం జరిగిందనే విషయాలు నిగ్గు తేల్చాల్సిన పోలీసులు సినిమా రేంజ్‌లో కథలు చెబుతున్నారు. ఆ కహానీలు ఎలా ఉన్నాయంటే పోలీసులే కొంపదీసి నేరస్తులతో కుమ్మయ్యారా..? ఏంటనే అనుమానాలు జనాలకు రాక తప్పట్లేదు..!

AP-Police.jpg

ఆనం విషయంలో ఇలా.. ఇంత అన్యాయమా..?

టీడీపీ (Telugudesam) తరఫున గట్టి వాయిస్ వినిపించే వారిలో ఆనం వెంకట రమణారెడ్డి ముందు వరుసలో ఉంటారు. అయితే ఆయన గొంతు నొక్కేయాలని భావించిన కొందరు దుండగులు ఇంటిపై దాడికి తెగబడేందుకు యత్నించారు. ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన పోలీసులు.. అబ్బే ఆనం ఇంటిపై దాడిచేసిన వారంతా కేవలం క్రేజ్ పెంచుకునేందుకే చేశారే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడం సిగ్గుచేటు. అంతేకాదండోయ్.. అసలు ఇదేమీ పెద్ద నేరం కాదని, దాడి చేయమని ఎవరూ ప్రేరేపించలేదని రాజకీయ కోణం లేనేలేదని చెప్పడం విచిత్రం. ఇదంతా ఓ రౌడీ షీటర్ తన గ్యాంగ్‌తో కలిసి చేసిన దాడి అని పోలీసులు తేల్చి నిందితులకు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపేశారు. ఈ ఘటనతో సభ్య సమాజానికి పోలీసులు ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో వారికే తెలియాలి మరి.

Anam.jpg

ఎంపీ కుటుంబం కిడ్నాప్ విషయంలో..!

శుక్రవారం నాడు జరిగిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satya Narayana) కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులోనూ పోలీసులు సినిమా స్టోరీని తలపించేలా చెప్పారు. 48 గంటలపాటు నిర్బంధంలో ఉంచుకున్న దుండగులు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాక ఎక్కడికో తీసుకెళ్తుంటే ఫోన్ లొకేషన్‌ (Phone Location) ట్రాక్ చేసి పట్టుకున్నట్లు పోలీసులు మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఇంతకీ ఆ ట్రాక్ చేసిన ఫోన్ ఎవరిది..? నిందితులు ఎక్కడ దిగిపోయారు..? అనేది తెలియట్లేదు. ఫోన్ ఎవరిదో తెలియనప్పుడు ట్రాకింగ్ చేయడం ఎలా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా..? తెరవెనుక ఏదైనా జరిగిందా..? అంటే కేవలం డబ్బు.. డబ్బు కోసం మాత్రమే కిడ్నాప్ చేశారని గట్టిగా వాదించి మరీ చెప్పడం గమనార్హం. అందులోనూ డీజీపీ రాజేంద్రనాథ్‌ మీడియా ముందుకొచ్చి ఇదివరకు పోలీసు అధికారులు చెప్పిన విషయాలే మళ్లీ చెప్పడం విచిత్రం. ఒక ఎంపీ.. అందులోనూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితేంటి..? భూ వివాదాలనే కేంద్రంగా చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ఎంవీవీ చేస్తున్నట్లు కోకొల్లలుగా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కోణంలో పోలీసులు ఎందుకు విచారించలేదు..? అనే ప్రశ్నకు సమాధానం లేదు. పోనీ.. ఈ రెండు ఘటనలేనా అంటే చెప్పుకుంటూ పోతే నాలుగేళ్లుగా ఇలాంటి చాలానే ఉన్నాయని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

mvv-satyanarayana.jpg

చూశారుగా.. ఈ రెండు ఘటనల్లో పోలీసులు ఎలాంటి కామెడీ కథలు చెప్పారు..? ఏమేం నిజానిజాలు దాచారు..? అనేది కాస్తో కూస్తో రాజకీయలు, సామాజిక విషయాలపై అవగాహన ఉన్న వాళ్లకే ఇట్లే అర్థమైపోతుంది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ పోలీసుల తీరు పూర్తిగా మారిపోయిందనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. నేరస్థులను కాపాడి బాధితుల్నే వేధించిన ఘటనలు చాలానే ఉన్నాయనే ముద్ర ఖాకీలపై పడిపోయింది. బాధ్యత గల పోలీసులే ఇలా ప్రవర్తిస్తే పరిస్థితేంటి..? నిందితులను కఠినంగా శిక్షించే పరిస్థితి లేనప్పుడు అసలు పోలీసులకు ఎందుకీ ఖాకీ డ్రెస్ అనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. ప్రతిదీ ఇలా చేసుకుంటూ పోతే.. ‘మాకు నమ్మకం లేదు పోలీసులూ’ అనే మాట జనాలు నోట పదే పదే వినాల్సి వస్తుందేమో..!

AP-DGP.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!


******************************

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

******************************

Janasena : పదే పదే పవన్ నోట అదే మాట.. ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.. సమాచారం ఎవరిచ్చారో..?


******************************

Updated Date - 2023-06-16T18:49:27+05:30 IST