CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ ఆసక్తికర కామెంట్స్

ABN , First Publish Date - 2023-09-30T14:21:20+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై (Chandra Babu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు...

CBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ ఆసక్తికర కామెంట్స్

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. దేశ విదేశాల నుంచి రోజురోజుకూ బాబుకు మద్దతు ఎక్కువ అవుతోంది. ఇక తెలంగాణకు చెందిన పలువురు ముఖ్యనేతలు, బీఆర్ఎస్ (BRS) కీలక నేతలు ఇప్పటికే స్పందించగా.. తాజాగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) సిద్ధిపేట పర్యటనలో భాగంగా స్పందించారు.


HARISH.jpg

హరీష్ ఏమన్నారు..?

శనివారం నాడు సిద్దిపేటలోని నంగునూరు మండలం నర్మెట్ట శివారులో ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన హరీష్.. బాబు అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. ‘ఇంత వయస్సులో చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం. ఒకప్పుడు ఐటీ అనే చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిపై మంచి మాటలు చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారు ఎకరాలు కొనే పరిస్థితులు ఉండే, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదారు ఎకరాలు వస్తుందని స్వయంగా చంద్రబాబు అన్నారు’ అని హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu.jpg

ఇదే మా ఉద్దేశం..!

ఈ ప్రాంత రైతులకు శుభదినం. రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు పడ్డాయి. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులు, అంతర పంటలు సాగు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆయిల్ ఫామ్ మొక్కల కొమ్మలు దగ్గరగా కట్టోద్దు.. అవి ఎంత విస్తారంగా పెరిగితే అంత దిగుబడి పెరుగుతుంది. అధికారులు, శాస్త్రవేత్తలతో మండలాల వారీగా ఆయిల్ ఫామ్ తోటల్లో మీటింగ్‌కు ఏర్పాటు చేసి రైతుల్లో అవగాహన కల్పించాలి. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రైతులు ఆర్థికంగా బాగుపడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. వడగళ్ళు, చీడపీడలతో వరి ఇతర పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఫామ్ ఆయిల్ సాగుతో ఆ సమస్య ఉండదు. దేశాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశం నష్టపోతున్నది. ప్రతి ఏటా లక్ష 56 వేల కోట్ల విలువైన నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. 40 శాతం మాత్రమే మన దేశంలో నూనె గింజలు పండిస్తే, 60 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, రష్యా, బ్రెజిల్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దేశాన్ని పాలించిన పాలకులకు దూరదృష్టి లేక ఈ దుస్థితి వచ్చింది. మన దేశానికి ఆయిల్ కొరత తీరాలంటే ఇంకా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ సాగు జరగాలి. 20 లక్షల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఫామ్ ఆయిల్ సాగుతో గ్రీన్ రెవల్యూషన్ సాధ్యం అవుతుంది. ఆయిల్ ఫామ్ సాగు రైతన్నకు అభయ హస్తం.. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని వాడొకడు.. వీడొకడు అంటున్నారు అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish-Rao.jpg

ఆలోచించండి..!

కేసీఆర్ లేకుంటే, తెలంగాణ రాకుంటే కాళేశ్వరం వస్తుండేనా, రైతులు బాగు పడేవారా..?. జై కిసాన్.. జై జవాన్.. మాటలు చెప్పిన వారి హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిహాట్. కేసీఆర్ హయాంలో గత తొమ్మిదేల్లలో కరువనేదే లేదు. కరెంట్ కోతలపై కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరం. రైతులకు 24 గంటలు అవసరం లేదు.. మూడు గంటలు సాలు అంటున్నారు కాంగ్రెసోళ్లు. వాళ్లవి తెలివి ఉన్న మటాలా? తెలివి లేని మాటాలా? ప్రజలే ఆలోచించాలిఅని హరీష్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి


YSRTP : వైఎస్సార్టీపీ విలీనంపై డైలామాలో షర్మిల.. సాయంత్రం ఏం ప్రకటన చేయబోతున్నారు..!?


TS Politics : పొంగులేటి ‘పాలేరు’ నుంచి పోటీచేస్తే తుమ్మల పరిస్థితేంటి.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..!?


Updated Date - 2023-09-30T14:27:02+05:30 IST