Share News

Telangana Elections: ట్రెండింగ్‌లో ఐటీ మినిస్టర్.. కొత్త మంత్రి ఎవరు?

ABN , First Publish Date - 2023-12-04T15:12:59+05:30 IST

New IT Minister: గత పదేళ్లుగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. కొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Telangana Elections: ట్రెండింగ్‌లో ఐటీ మినిస్టర్.. కొత్త మంత్రి ఎవరు?

తెలంగాణలో ఎంతో ఆసక్తి రేపిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు మాత్రమే రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గత పదేళ్లుగా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ అద్భుత సేవలు అందించారని.. ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఎవరంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను మిస్ అవుతామని పలువురు కామెంట్ చేస్తున్నారు. కొందరు బీఆర్ఎస్ అభిమానులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేయాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాలను పక్కన పెడితే కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా అద్భుతంగా పనిచేశారని.. ఐటీ కంపెనీలను తేవడంలో, సైబరాబాద్ పరిధిలో అభివృద్ధి విషయంలో కేటీఆర్ పనితీరు ఎంతో మెచ్చుకోదగ్గ విధంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ తమకు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ కావాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్న బీఆర్ఎస్ అభిమానులపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఐటీ శాఖ మంత్రి ఎవరు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే రేసులో ఎవరున్నారని ఆరా తీస్తే ముగ్గురు, నలుగురు ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. కొందరు కాంగ్రెస్ అభిమానులు రేవంత్ రెడ్డి సీఎం అయినా ఆయన దగ్గరే ఐటీ శాఖ ఉంటుందని అంటున్నారు. మరికొందరు మాత్రం దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లేదా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ స్థాయిలో మాట్లాడే సత్తా, సైబరాబాద్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఎవరికి ఉన్నాయా అంటూ మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ (ఎక్స్)లో ఐటీ మినిస్టర్ అనే పదం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అటు హైదరాబాద్ టీ-హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డా.శాంత ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఓడినప్పటి నుంచి తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు వస్తున్నాయని.. ఐటీలో తెలంగాణను ముందుంచిన కేటీఆర్‌తోనే ఇప్పటికీ వర్క్ చేయాలని ఉందని ఆమె అన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T15:51:33+05:30 IST