CBN CID Custody : చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభం.. గంట గంటకూ ఇలా..

ABN , First Publish Date - 2023-09-23T10:03:13+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది...

CBN CID Custody : చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభం.. గంట గంటకూ ఇలా..

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది. మొత్తం 9 మంది అధికారుల బాబును విచారిస్తున్నది. న్యాయవాదుల సమక్షంలోనే.. కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ విచారణ జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. విచారణ ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయగా.. విచారణ పూర్తయ్యాక కూడా వైద్యులు పరీక్షలు చేయనున్నారు.


CBN-Case.jpg

గంట గంటకూ ఇలా..!

కాగా.. విచారణలో భాగంగా ప్రతి గంటకు 5 నిమిషాల పాటు చంద్రబాబుకు సీఐడీ అధికారులు బ్రేక్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఉండనుంది. విరామం తర్వాత సాయంత్రం ఐదు వరకు విచారణ కొనసాగనున్నది. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ డిపార్ట్‌మెంట్‌ వీడియోగ్రఫీ తీస్తున్నది. జైలు పరిసర ప్రాంతాల్లో రెండంచెల భారీ బందోస్తును అధికారులు ఏర్పాటు చేశారు. రెండు అంబులెన్సులు సైతం జైలు లోపల సిద్ధంగా ఉన్నాయి.

Rajamundry-Jai;.jpg

విచారణ చేస్తున్నది వీరే.. :-

  • CID DSP ధనుంజయుడు నేతృత్వంలో..

  • వి.విజయ్‌భాస్కర్

  • ఎ.లక్ష్మీనారాయణ

  • ఎం.సత్యనారాయణ

  • మోహన్‌

  • రవికుమార్

  • శ్రీనివాసన్

  • సాంబశివరావు

  • రంగనాయకులు

  • వీరితో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు

  • వీడియోగ్రాఫర్

బాబు తరఫున హాజరైన ఇద్దరు న్యాయవాదులు :-

  • దమ్మాలపాటి శ్రీనివాస్‌

  • గింజుపల్లి సుబ్బారావు

Ambulance-and-police.jpg

Updated Date - 2023-09-23T10:26:11+05:30 IST