Share News

TS Politics : ఎన్నికల ముందు పెను సంచలనం.. బీఆర్ఎస్‌లోకి బండారు దత్తాత్రేయ కుమార్తె..!!

ABN , First Publish Date - 2023-11-06T22:09:04+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించిన నేతలు అనుకున్నట్లుగా రాకపోవడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నీ అటుంచితే..

TS Politics : ఎన్నికల ముందు పెను సంచలనం.. బీఆర్ఎస్‌లోకి బండారు దత్తాత్రేయ కుమార్తె..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించిన నేతలు అనుకున్నట్లుగా రాకపోవడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్‌లు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నీ అటుంచితే.. గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి బీజేపీకి గుడ్ బై చెప్పి.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ వార్త తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెను సంచలనంగా మారింది. ఎందుకంటే.. దత్తాత్రేయ అలియాస్ దత్తన్న గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ కార్యకర్తగా, నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం హర్యానా గవర్నర్‌గా పనిచేస్తున్నారు. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. అలాంది దత్తన్న కూతురు బీజేపీకి గుడ్ బై చెప్పి చెబుతారన్న వార్త గురించే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.


Bandaru-Vijayalakshmi.jpg

ఎందుకీ పరిస్థితి..?

వాస్తవానికి.. గత కొంతకాలంగా ముషీరాబాద్ బీజేపీ సీటు మీద ఆశలు పెట్టుకున్న బండారు విజయలక్ష్మి ఆ సీటును పూసల రాజుకు కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్నారు. ఇదే అదునుగా అధికార బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆమెతో మాట్లాడి నామినేటెడ్ పదవి ఆఫర్ చేసి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. బీజేపీ కురువృద్ధుడు దత్తాత్రేయ కుమార్తెగానే కాకుండా అన్ని అర్హతలు కలిగిన తనను పక్కన పెట్టడం ఎంతగానో మనస్థాపాన్ని కలిగించిందని విజయలక్ష్మి తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. కేవలం లక్ష్మణ్‌కు పోటీ అవుతాననే కారణంగానే తనను పక్కన పెట్టారని ఇది ముమ్మాటికీ అవమానమేనని అనుచరులు, ఆప్తులు వద్ద వాపోయారని తెలుస్తోంది. చివరి నిమిషం వరకు టికెట్ మీద ఆశలు పెట్టి.. లక్ష్మణ్, కిషన్ రెడ్డి కలిసి భవిష్యత్తులో వారికి ఇబ్బంది రాకుండా తనను తప్పించారని విజయలక్ష్మి వాపోతున్నట్టు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి..కొన్నేళ్లుగా పార్టీ వ్యవహారాల్లో ఆమె పాల్గొంటున్నారు. నాన్న అడుగుజాడల్లో నడవాలని ఎన్నో కలలు కూడా కన్నారు. కానీ రాజకీయ అరంగేట్రంలోనే ఇలా జరగడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారని తెలుస్తోంది.

Bandaru.jpeg

ఏదో అనుకుంటే..?

వాస్తవానికి.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే ముషీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. ఈ క్యాడరే లక్ష్మణ్‌ను రెండు పర్యాయాలు గెలిపించింది. మరోవైపు.. దత్తాత్రేయ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల సమయంలో విజయలక్ష్మి తన తండ్రి కోసం ముమ్మర ప్రచారం నిర్వహించారు. దీంతో ముషీరాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులతో విజయలక్ష్మికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. నాటి నుంచి నేటివరకూ నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే ముందుండి పరిష్కార మార్గం చూపేవారు. పక్కాగా తనకు టికెట్ ఇస్తారని.. గెలుస్తానని కూడా ఆమె భావించారు. పైగా లక్ష్మణ్ కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉండంటంతో ఎలాంటి అడ్డంకులు ఉండని భావించారు కానీ.. సడన్‌గా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక కాషాయ కండువా తీసేసీ గులాబీ కండువా కప్పుకోవాలని విజయలక్ష్మి ఫిక్స్ అయ్యారట.

Bandaru 1.jpeg

ఇదేగానీ జరిగితే..?

బీఆర్ఎస్ ఆఫర్ చేసిన నామినేటెడ్ పదవికి ఒప్పుకొని కాషాయ కండువా తీసేసి.. గులాబీ కండువా కప్పుకుంటారా..? లేకుంటే పార్టీలోనే కొనసాగుతారా..? అనేది చూడాలి. అయితే.. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం విజయలక్ష్మి పక్కాగా బీఆర్ఎస్‌లో పక్కాగా చేరుతున్నారని అనుచరులు, సన్నిహితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ నామినేటెడ్ పదవి ఏంటి..? అనేది తెలియాల్సి ఉంది. అయితే.. ఇంత జరుగుతున్నప్పటికీ బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి బుజ్జగింపులు కూడా లేవట. మరోవైపు ఈ వార్తలపై ఆమె కూడా ఎక్కడా స్పందించలేదు.. కనీసం ఖండించలేదు కూడా. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో చరిత్ర ఉన్న దత్తన్న కుమార్తె కండువా మారిస్తే మాత్రం బీజేపీకి భారీ నష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

TG-Map-and-Parties.jpg


ఇవి కూడా చదవండి


TS Polls : అజారుద్దీన్‌కు బిగ్ రిలీఫ్.. నామినేషన్‌కు లైన్ క్లియర్


TS Polls : కాంగ్రెస్-సీపీఐ మధ్య కుదిరిన సయోధ్య.. డీల్ సెట్ చేసిన రేవంత్!!


TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్


Updated Date - 2023-11-06T22:13:10+05:30 IST