AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?

ABN , First Publish Date - 2023-07-13T18:37:36+05:30 IST

వైసీపీ ప్రముఖ మద్దతుదారుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంశాన్ని పక్కదారి పట్టించి ఉమెన్ ట్రాఫికింగ్‌కు వక్రభాష్యాలు చెప్తూ అసలు పాయింట్‌ను పోసాని పక్కదారి పట్టించారు.

AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?

ఏపీ(Andhra Pradesh)లో ప్రస్తుతం ఉమెన్ ట్రాఫికింగ్‌(Women Trafficking)పై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. వాలంటీర్లలో చాలా మంది ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విమర్శలు చేశారు. NCRB లెక్కల ప్రకారం 2023 నాటికి ఏపీలో 30వేల మందికి పైగా మహిళలు అదృశ్యమయ్యారని.. దీనికి వాలంటీర్లే కారణమంటూ పవన్ తనదైన స్టైలులో ఆరోపించారు. దీంతో సోషల్ మీడియా(Social Media)లో జనసైనికులు, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆరోపించిన అంశాన్ని పక్కదారి పట్టించి వాలంటీర్లను ఆయన దూషించారని.. పవన్ వెంటనే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు (YSRCP Leaders) డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ప్రముఖ మద్దతుదారుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మీడియా ముందు ఊగిపోయారు. నోటికి ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ కార్యకర్తలను దూషించారు. ఉమెన్ ట్రాఫికింగ్‌కు వక్రభాష్యాలు చెప్తూ అసలు పాయింట్‌ను పోసాని పక్కదారి పట్టించారు. నిజానికి ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మహిళలను అక్రమ రవాణా చేయడం అని అర్ధం. కానీ పోసాని ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఆడవాళ్లను కించపరచడం అని.. ఆడవాళ్లతో చెడుతిరుగుళ్లు అన్న తరహాలో అర్ధం చెప్పారు. దీంతో ప్రెస్‌మీట్ పెట్టి పోసాని తన పరువు తానే తీసుకున్నారు. ఓరి బాబోయ్.. ‘హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకు 'ఆడవాళ్లను కించపరచడం’ అంటూ పెడార్థం తీస్తున్నావా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు.

గతంలో అమెరికాలో తన స్నేహితులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగిన ఫోటోలను చూపిస్తూ ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ పోసాని దుర్భాషలాడారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులను కొందరు ఉద్దేశపూర్వకంగా కించపరిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని పోసాని ప్రశ్నించారుు. అలాగే కొందరు మీడియా అధినేతల పేర్లను, కులం పేరును ప్రస్తావిస్తూ లక్ష్మీపార్వతిని చులకనగా చూశారంటూ ఆరోపించారు. అప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ కనిపించలేదా పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వాలంటీర్లలో మహిళలే కనిపిస్తున్నారా అంటూ మాట్లాడారు. దీంతో పోసానికి నోటి దూల చాలా ఎక్కువ అని నెటిజన్‌లు మండిపడుతున్నారు. మెంటల్ కృష్ణకు నిజంగానే మెంటల్ ఎక్కిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. పబ్‌లకు వెళ్తే ఉమెన్ ట్రాఫికింగ్ ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. అసలు పోసానికి ఉమెన్ ట్రాఫికింగ్ అంటే ఏంటో తెలియదని.. అలాంటప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి పవన్‌ను తిట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్వెంట్ ఇంతకంటే ఎలా మాట్లాడతాడులే అని నెటిజన్‌లు నిట్టూర్పు చెందుతున్నారు.


కాగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని.. తాను చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూరలో తాలింపుగాడు అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో జనసైనికులు పోసానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి పోసాని అమ్ముడుపోయాడని.. జగన్ ఏది చెప్తే అది చేస్తున్నాడని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అయినా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత పోసానికి లేదని స్పష్టం చేస్తున్నారు. ఎథిక్స్ నేర్చుకోవాల్సింది పవన్ కాదని పోసాని ముందు ఆ పని చేయాలని నెటిజన్‌లు హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Jagan: డేటా స్కాం... జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..!!

AP Politics: ఆందోళనలు ఉధృతం చేసిన అంగన్వాడీలు.. అయినా జగన్ పట్టించుకోరా?

Updated Date - 2023-07-13T18:44:26+05:30 IST