Jagan: డేటా స్కాం... జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..!!

ABN , First Publish Date - 2023-07-13T12:44:20+05:30 IST

రూ.5వేలు జీతం తీసుకునే వాలంటీర్లను పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు జగన్ ప్రభుత్వం వాడుకుంటోంది. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ డేటా సేకరణపై సీఎం జగన్ నోరు విప్పకుండా తమ పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారు. అయితే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజల డేటా సేకరిస్తుందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున జగన్ విమర్శలు చేశారు. అదే జగన్ ఇప్పుడు అధికారంలో ఉండగా డేటా సేకరణ ఎలా భద్రమంటూ జనసైనికులు పాత వీడియోలను షేర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Jagan: డేటా స్కాం...  జగన్ అప్పుడలా.. ఇప్పుడిలా..!!

ఏపీలో ప్రస్తుతం వాలంటీర్లు సేకరిస్తున్న డేటా విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సంక్షేమ పథకాల అమలు పేరుతో వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల డేటా భద్రమేనా అన్న విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే వాళ్లకు జనసైనికులు అదిరిపోయే రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సేకరణ పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, వివాహేతర బంధాలతో పాటు సోషల్ మీడియా అకౌంట్లు, వాహనాల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, ఇంటి సభ్యులు ఎక్కడెక్కడ ఉంటున్నారు.. వాళ్ల వివరాలను సేకరించాల్సిన పనేంటని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే వాటికి సమాధానం చెప్పకుండా వైసీపీ కార్యకర్తలు ఎదురుదాడి చేస్తున్నారు. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ అభాసుపాలవుతున్నారు.

WhatsApp Image 2023-07-12 at 2.25.56 PM.jpeg

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ డేటా సేకరణపై సీఎం జగన్ నోరు విప్పకుండా తమ పార్టీ నేతలకు మద్దతు పలుకుతున్నారు. అయితే గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రజల డేటా సేకరిస్తుందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున జగన్ విమర్శలు చేశారు. డేటా స్కాం జరుగుతోందంటూ తెగ హడావిడి చేశారు. ప్రజల డేటాకు ప్రైవసీ లేకపోతే ఎలా అని.. ప్రజల డేటాను సేకరించి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. మరి అదే జగన్ ఇప్పుడు అధికారంలో ఉండగా డేటా సేకరణ ఎలా భద్రమంటూ జనసైనికులు పాత వీడియోలను షేర్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ ఊసరవెల్లి రాజకీయాలను చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. వ్యక్తిగత సమాచారంతో పూర్తి స్థాయిలో ప్రజలపై కుట్ర చేయబోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారి వ్యక్తిగత వివరాలను బయట పెట్టడం.. కుటుంబ ఫోటోలను వెలుగులోకి తేవడం వంటివి చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం సేకరించే సమాచారం అవసరానికే ఉండాలి కానీ అవసరం లేకపోయినా అన్ని రకాల సమాచారాలను సేకరించడం సబబు కాదని హితవు పలుకుతున్నారు. ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలు నిజమేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.

అసలు వాలంటీర్ల పనేంటి?

రూ.5వేలు జీతం తీసుకునే వాలంటీర్లను పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు జగన్ ప్రభుత్వం వాడుకుంటోంది. నిజానికి వాలంటీర్లు చేసే పనులు కూడా ఏమీ ఉండవు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వడం.. తర్వాత ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ (ఎఫ్‌వోఏ) నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం డేటాను కలెక్ట్ చేయడమే వాలంటీర్ల పని. ఇంటింటికీ తిరిగి వైసీపీకి అనుకూలంగా లేని ఓట్లను తొలగించడం.. వ్యక్తిగత వివరాలు సేకరించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం వంటివి కొందరు వాలంటీర్లు చేస్తున్నారు. ఆస్తుల వివరాలు కూడా సేకరించి ముసలి వాళ్లు ఉన్న ఇళ్లల్లో తెలివిగా వ్యవహరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వాలంటీర్లు 30 శాతం మాత్రమే మంచి పనులు చేస్తున్నారని.. 70 శాతం అసాంఘిక కార్యకలాపాలే చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. అలా అని వాలంటీర్లందరూ చెడ్డవాళ్లు కాదు..వాళ్లలోనూ కొందరు కేడీలు ఉన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించగా వైసీపీ భుజాలు తడుముకుంటూ తాను తవ్విన గోతిలో తానే పడి గగ్గోలు పెడుతోంది.

ఇవి కూడా చదవండి:

AP Politics: ఆందోళనలు ఉధృతం చేసిన అంగన్వాడీలు.. అయినా జగన్ పట్టించుకోరా?

Pawan Anna lezhneva : ఉంటే ఉంటా.. పోతే పోతా.. భార్యకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్.. భావోద్వేగం!

Updated Date - 2023-07-13T12:44:20+05:30 IST