Ponguleti : మరికొన్ని గంటల్లో పొలిటికల్ ఫ్యూచర్ తేల్చేయనున్న పొంగులేటి.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకెళ్లి..!

ABN , First Publish Date - 2023-04-10T22:03:58+05:30 IST

పొంగులేటి.. పొంగులేటి.. (Ponguleti Srinivas Reddy) ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే (Khammam District) కాదు తెలంగాణ వ్యా్ప్తంగా మార్మోగుతున్న పేరు.

Ponguleti : మరికొన్ని గంటల్లో పొలిటికల్ ఫ్యూచర్ తేల్చేయనున్న పొంగులేటి.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకెళ్లి..!

పొంగులేటి.. పొంగులేటి.. (Ponguleti Srinivas Reddy) ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనే (Khammam District) కాదు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. బీఆర్ఎస్‌తో బంధం తెగిపోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు..? కాంగ్రెస్‌లో చేరుతారా.. లేకుంటే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? ఈ రెండు జాతీయ పార్టీలను కాదని వైఎస్సార్టీపీలో చేరుతారా..? ఇప్పుడీ ప్రశ్నలే అభిమానులు, కార్యకర్తల్లో మెదులుతున్నాయ్. అయితే పొంగులేటి మనసులో ఏముంది..? అభిమానులు, అనుచరులు ఏమనుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..

Ponguleti-and-kcr.jpg

పొంగులేటి నిర్ణయమేంటో..!

బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారని పొంగులేటి శ్రీనివాస రెడ్డిని, జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్ఠానం. దీంతో ఈ ఇద్దరిపైనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ దృష్టి సారించాయి. అయితే ఈ ఇద్దరి కేడర్ మాత్రం కాంగ్రెస్‌లోనే చేరాలని ఒత్తిడి తెస్తోందట. పొంగులేటి విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీకి రెబల్‌గా మారిన నాటి నుంచి ఓ రేంజ్‌లో కేసీఆర్ సర్కార్‌పై (KCR Govt) విమర్శలు, ఛాలెంజ్‌లు విసురుతూ వచ్చారు. అంతేకాదు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ఎక్కడా తన కేడర్ వదిలిపోకుండా అంతా పకడ్బందిగా చేస్తూ వచ్చారు. తనకు వ్యక్తిగతంగా బాగా పట్టున్న నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల కోసం అభ్యర్థులను సైతం ప్రకటించేస్తూ వచ్చారు. ఏ పార్టీ తరఫున పోటీచేస్తారు..? తాను ఏ పార్టీలోకి వెళ్తారనే విషయాన్ని చెప్పకుండానే ఇలా అన్నీ ప్రకటనలు చేస్తూ వచ్చారాయన. సీన్ కట్ చేస్తే.. సోమవారం నాడు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో మరోసారి మీడియా ముందుకొచ్చి కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. నాటినుంచే బీజేపీకి పొంగులేటి టచ్‌లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడిక అధికారికంగా బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేయడంతో కాషాయ కండువా కప్పుకునేదెన్నడు..? అని ఆయనతో కొందరు కమలనాథులు టచ్‌లోకి వెళ్లారట. అయితే మరికొన్ని గంటల్లోనే కేడర్, అభిమానులు, అనుచరులతో కీలక సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతారని ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Ponguleti-and-jupally.jpg

బీజేపీలో చేరితే పరిస్థితేంటి.!?

ఈ నెల 18న ఢిల్లీ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Union Minister Amit Shah) పొంగులేటి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా బీజేపీలో చేరితే పరిస్థితేంటి..? తనతో పాటు ఎంతమందికి టికెట్లు ఇస్తారు..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత పొంగులేటి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈయన బీజేపీలో చేరితే పార్టీకి ఏ మాత్రంలేని జిల్లాలో పాగా వేయొచ్చన్నది కమలనాథులు భావనట. బీజేపీలో చేరితే మాత్రం.. ఖమ్మం కోట ఒకప్పుడు కమ్యూనిస్టులు, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్‌గా ఉందని.. రానున్న రోజుల్లో కాషాయమయంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అసలు రాష్ట్రంలో పార్టీ లేనప్పుడు వైసీపీ తరఫున తాను గెలవడమే కాకుండా.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు.. అలాంటిది ఇప్పుడు బీజేపీలోకి ఈయన చేరితే మాత్రం సీన్ మొత్తం మారిపోతుందని కమలనాథులు యోచిస్తున్నారట. పార్టీ తరఫున పొంగులేటితో పాటు ఆయన అనుకూలంగా స్థానాల్లో బరిలోకి దింపితే కచ్చితంగా గెలిపించుకుని వస్తారని బీజేపీ అనుకుంటోందట. ఇదే జరిగితే అటు లోక్‌సభ‌లో.. ఇటు అసెంబ్లీలో కూడా సీట్లు పెరిగినా పెరగొచ్చన్న మాట. ఒక్క ఖమ్మంలో జిల్లాలోనే బీజేపీకి ఎంట్రీ కాకుండా.. పొరుగు జిల్లాల్లో కూడా ప్రభావం చూపే చాన్స్ ఉంది. అసలే కేడర్ లేని చోట ఇలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారట. అందుకే పొంగులేటి కోసం గట్టి పట్టు పట్టారట కమలనాథులు.

Ponguleti.jpg

మొత్తానికి చూస్తే.. పొంగులేటి కోసం బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. తన పొలిటికల్ ఫ్యూచర్‌పై కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఆ తర్వాత ఢిల్లీకెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారా లేకుంటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని తిరిగొస్తారా..? అన్నది తేలియాల్సి ఉంది.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

TS Politics : పొంగులేటి, జూపల్లికి టచ్‌లోకి వెళ్లిన బీజేపీ.. సరిగ్గా ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

*****************************

TS Politics : పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు.. ఇద్దరి దారి ఒకటేనా.. వేర్వేరా.. టచ్‌లోకి వెళ్లిందెవరు..!

*****************************

Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!

*****************************

Kiran Reddy : ఢిల్లీలో బిజిబిజీగా కిరణ్ రెడ్డి.. కీలక పదవి ఇవ్వబోతున్నారా.. పోటీ ఎక్కడ్నుంచో..!?


*****************************

Kiran Reddy : ఏపీలో బీజేపీకి ఆశా ‘కిరణ్’మా.. ఈయన్ను పార్టీ ఎలా వాడుకోబోతోంది.. అధిష్ఠానం ప్లానేంటి..!?


*****************************

Updated Date - 2023-04-11T06:42:11+05:30 IST