YuvaGalamPadayatra: టీడీపీ రె‘ఢీ’.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న లోకేష్ పాదయాత్ర

ABN , First Publish Date - 2023-01-27T14:11:11+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (YuvaGalamPadayatra) అశేష జనవాహిని మధ్య ప్రారంభమైంది. ఏపీ యువతకు, ప్రజానీకానికి..

YuvaGalamPadayatra: టీడీపీ రె‘ఢీ’.. సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న లోకేష్ పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేశ్ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (YuvaGalamPadayatra) అశేష జనవాహిని మధ్య ప్రారంభమైంది. ఏపీ యువతకు, ప్రజానీకానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై గళమెత్తడమే లక్ష్యంగా మొదలైన ఈ ‘యువగళం’ పాదయాత్ర ఇంటర్నెట్‌లో కూడా ట్రెండ్ సృష్టించింది.

Twitter.jpg

ట్విట్టర్‌లో లోకేష్ పాదయాత్రకు (Lokesh YuvaGalamPadayatra Twitter) సంబంధించిన #YuvaGalamPadayatra అనే హ్యాష్‌ట్యాగ్ సెన్సేషన్ క్రియేట్ చేసే దిశగా దుమ్మురేపుతోంది. ఇప్పటికే లక్షకు పైగా ట్వీట్స్ #YuvaGalamPadayatra హ్యాష్‌ట్యాగ్‌తో నమోదు కావడం విశేషం.

26a4ce09-02b2-43e3-bcae-7c69f6df3ceb.jfif

గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media) సాక్షిగా చేసిన యాంటీ క్యాంపెయిన్ టీడీపీ ఓటమికి కారణమైన అంశాల్లో ఒకటి. అందుకే.. ఈసారి మాత్రం ఆ ఛాన్స్ వైసీపీకి ఇవ్వకూడదని టీడీపీ సోషల్ మీడియా విభాగం డిసైడ్ అయింది. వైసీపీని అదే సోషల్ మీడియా వేదికగా తిప్పి కొడుతూ జగన్ సోషల్ మీడియా అనుకూల పేజ్‌లకు చుక్కలు చూపిస్తోంది. అదే విధంగా.. ప్రజలకు మద్దతుగా టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లే విషయంలో ‘తగ్గేదేలే’ అని టీడీపీ సోషల్ మీడియా విభాగం దూసుకెళ్తోంది.

e8633ba1-e142-46eb-95ad-96f6523e2727.jfif

ఇందులో భాగంగా.. లోకేష్ పాదయాత్రకు సంబంధించిన హైలైట్స్‌ను ఫొటోల రూపంలో, వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకెళుతూ టీడీపీని ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. వైసీపీ దిగజారుడు పోస్టులకు అంతేస్థాయిలో ధీటుగా కౌంటర్ ఇస్తూ టీడీపీ సోషల్ మీడియా జోరు మీద ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీకి సోషల్ మీడియా విభాగం ఉన్నప్పటికీ ఇప్పుడున్నంత దూకుడుగా లేకపోవడం వైసీపీకి కలిసొచ్చింది. కానీ.. ఇప్పుడు లెక్కలు మారాయి.

1f6cc297-fe84-4d27-acbb-23249ff3a8bd.jfif

వైసీపీ సోషల్ మీడియా టీమే బెదిరిపోయేలా కౌంటర్ పోస్టులు, వీడియోలతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ సింహంలా జూలు విదిల్చింది. ట్విట్టర్ అయినా సరే, ఫేస్‌బుక్ అయినా సరే, ఫొటోలతో అయినా సరే, వీడియోలతో అయినా సరే.. సోషల్ మీడియా పేజ్ ఏదైనా, వేదిక ఏదైనా సరే.. ‘ఢీ’ కొట్టేందుకు తెలుగుదేశం రెడీ అనేంత దూకుడుగా సోషల్ మీడియా సాక్షిగా టీడీపీ వైసీపీకి సవాల్ విసురుతోంది.

Updated Date - 2023-01-27T14:19:20+05:30 IST