Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..

ABN , First Publish Date - 2023-04-06T17:58:32+05:30 IST

అవును.. నిండు సభలో అది కూడా స్టేజ్‌పైన మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini ) ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు.

Rajini Emotional : బాబోయ్.. నిండు సభలో జగన్ గురించి మాట్లాడుతూ విడదల రజిని కంటతడి.. నాడు అలా.. నేడు ఇలా.. సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోలు..

అవును.. నిండు సభలో అది కూడా స్టేజ్‌పైన మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini ) ఎమోషనల్ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. దీంతో అప్పటి వరకూ ఈలలు, కేకలతో మార్మోగిన సభలో ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఒక నిమిషం తర్వాత ఆ భావోద్వేగం నుంచి తేరుకున్నాక మళ్లీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు మంత్రి. ఇంతకీ మంత్రిగారు ఇంతలా ఎమోషనల్ (Emotional) ఎందుకయ్యారు..? సభలో జగన్ గురించి ఏం మాట్లాడారు..? రజిని ఎమోషనల్ అయినప్పుడు సీఎం రియాక్షన్ ఎలా ఉంది..? అసలు ఇప్పుడిలా మాట్లాడిన రజిని ఒకప్పుడు చంద్రబాబు గురించి మహానాడులో ఏం మాట్లాడారు..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Rajini-Emotional.jpg

అసలేం జరిగింది..!?

పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) మండలం లింగంగుంట్ల గ్రామంలో ‘ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం’ (Family Doctor Program) ప్రారంభోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యశాఖ మంత్రి (Health Minister) కావడంతో ఇందులో విడదల రజిని పాల్గొన్నారు. పైగా ఈ కార్యక్రమం జరిగింది కూడా రజిని సొంత నియోజకవర్గంలోనే. కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ ఎమోషనల్‌కు లోనయ్యారు. ‘ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెబుతున్నా. నా రాజకీయ జీవితం, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి జగనన్న పెట్టిన భిక్షే. సాధారణ బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు మంత్రిని చేశారు. జగనన్నా.. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా.. మీ ఆలోచన అమలే ధ్యేయంగా, మీ ఆదర్శాలే ఆచరణగా, మీ నాయకత్వమే నా అదృష్టంగా, మీరు నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని నేను నిజాయితీగా నిర్వర్తిస్తూనే ఉంటాను’ అని రజిని భావోద్వేగంతో కంట‌త‌డి పెట్టారు. రజిని మాటలతో ఒక్కసారిగా సభ మొత్తం జనాలు, అభిమానులు, కార్యకర్తలు మౌనంగా ఉండిపోయారు. ఆ భావోద్వేగం నుంచి కోలుకున్న రజిని నిమిషం తర్వాత మళ్లీ ప్రసంగాన్ని ప్రారంభించారు.

Rajini-Emotional-d.jpg

జగన్ రియాక్షన్ ఇదీ..!

రజిని ఎమోషనల్ అయ్యేసరికి జగన్ కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి మళ్లీ ప్రసంగం కంటిన్యూ చేసినప్పుడు ఇక సభకు వచ్చిన యువత ఈలలు, కేకలతో హోరెత్తించారు. ‘జై జగన్.. జై జై రజిని అక్క’ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. ఇంకొందరు జై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని హడావుడి చేశారు. ఆ తర్వాత ఇక జగన్ గురించి రజిని మాట్లాడుతూ ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు. ‘సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2007లో ఇదే ఏప్రిల్‌ నెలలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యరంగంలో ఆరోగ్యశ్రీతో విప్లవాత్మక పథకానికి నాంది పలికారు. ఆరోగ్యశ్రీ పథకం దేశానికే దిక్సూచిగా నిలిచి సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల తరువాత వైద్యరంగంలో ఇదే ఏప్రిల్‌లో ఆ మహానేత తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ తండ్రికి మించి పేదలకు మంచి అని మన రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టును చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది’ అని మంత్రి రజిని చెప్పుకొచ్చారు. చిలుకలూరిపేటలో అంతా జగనన్న అని పిలిస్తే.. ఎక్కడో ఉన్న చంద్రబాబు ఉలిక్కి పడాలని కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి రజిని మాట్లాడారు. అనంతరం ఇదే సభావేదికగా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులు చేయాలని సీఎం జగన్‌కు మంత్రి అభ్యర్థించారు.

YS-Jagan-and-Rajini.jpg

ఒకప్పుడు చంద్రబాబు గురించి ఇలా..!

రజిని టీడీపీలో ఉన్నప్పుడు మహానాడులో (Mahanadu) ప్రసంగించే ఛాన్స్ వచ్చింది. ఈమె ప్రసంగం పూర్తయ్యేవరకూ మైక్ కట్ చేయొద్దని మరీ టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu)మాట్లాడించారు. సార్.. అభిమానంతో నేను ఒక మాట చెబుదాం అనుకుంటున్నాను.. ఒక్కసారి నావైపు చూడండి. నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను.200 మందికి పైగా ఎంప్లాయిస్ ఉన్నారు. మన వాళ్లే కాకుండా, విదేశీయులు కూడా పనిచేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ది బెస్ట్ అయిన నేను.. మీ దగ్గరుండాలి అని నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా గుండెల్లో నుంచి వచ్చిన మాట. మీరు (చంద్రబాబు) ఎప్పుడూ అభివృద్ధి, అభివృద్ధి అంటుంటారు. మీరు సైబరాబాద్‌లో పెట్టిన చెట్టు ముక్క సార్ నేను. అలా సైబర్ టవర్స్‌లో ఎదిగి.. మీ ముందు నేను ఇలా అయ్యాను అని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందకు చాలా హ్యాపీగా ఉంది అని రజిని చెప్పుకొచ్చారు. ఈమె ప్రసంగానికి ఫిదా అయిన చంద్రబాబు.. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాలని స్వయంగా ఆయనే చెప్పారు.

Vidadala-Rajini-TDP.jpg

మొత్తానికి చూస్తే.. రజిని ఎమోషనల్ అయిన వీడియోలు ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఓ రేంజ్‌లో ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. ఇక కామెంట్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు. రానున్న టికెట్ కోసం ఇప్పట్నుంచి రజినక్క స్టార్ట్ చేసేశారు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మంత్రిగారు మరీ అతి చేస్తున్నారేంటబ్బాకామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు అయితే.. గతంలో ఇలానే సభావేదికగా చంద్రబాబు గురించి రజిని మాట్లాడిన వీడియో క్లిప్‌లను వైరల్ చేస్తూ.. చూశారా అప్పడలా.. ఇప్పుడిలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాడు టీడీపీ సభలో.. నేను వైసీపీ సభలో మాట్లాడిన వీడియోలను మిక్స్ చేసి ఆహా.. ఓహో.. మీకు ఆస్కార్ కూడా తక్కువే రజిని అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. సొంత పార్టీ కార్యకర్తలే.. మాట్లాడొచ్చు కానీ మరీ ఇంత అతిగా మాట్లాడకూడదమ్మా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Chilakaluripet.jpg

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Pawan Delhi Tour : పవన్ స్వయంగా ఢిల్లీకెళ్లారా.. కమలనాథులే పిలిపించుకున్నారా.. పర్యటన ఒక్కటే.. ప్రశ్నలెన్నో.. కొసమెరుపు ఏమిటంటే..!

*****************************
Pawan Delhi Tour : అమిత్ షాను కలవకుండానే హైదరాబాద్‌కు వెనుదిరిగిన పవన్.. ఢిల్లీలో అసలేం జరిగింది.. ఏదో అనుకుంటే..!

*****************************

YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!

*****************************

Updated Date - 2023-04-06T18:12:48+05:30 IST