Bus bay Collapse: జఫ్పాలకు అది మాత్రమే తెలుసు.. వైసీపీపై మీమ్స్ మాములుగా లేవుగా..!!

ABN , First Publish Date - 2023-08-28T14:32:47+05:30 IST

విశాఖలో బస్ బే కూలిపోవడంపై సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తిపోతున్నాయి. ఇది శాశ్వత నిర్మాణం కాదని.. రేకులతో కట్టేసి.. పిల్లర్ లేకుండా రాడ్లతో కట్టేశారని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం 5 నెలలు తిరగకుండానే బస్ బే కూలిపోవడంలో అవినీతి దాగి ఉందని మండిపడుతున్నారు.

Bus bay Collapse: జఫ్పాలకు అది మాత్రమే తెలుసు.. వైసీపీపై మీమ్స్ మాములుగా లేవుగా..!!

విశాఖలో జీవీఎంసీ కార్యాలయం సమీపంలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన బస్ బే కూలిపోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కూల్చడమే కాని నిర్మించడం చేతకాని జగన్ ప్రభుత్వం కట్టిన బస్ బే కూలిపోవడం వైసీపీ సర్కారు పనితీరుకు నిదర్శనమని అందరూ చర్చించుకుంటున్నారు. బస్ బే నిర్మాణంలో పెద్ద స్కాం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. రూ.5 కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వం నిర్మించింది ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం 5 నెలలు తిరగకుండానే బస్ బే కూలిపోవడంలో అవినీతి దాగి ఉందని ఆరోపిస్తున్నారు.


అంతేకాకుండా రూ.లక్ష కూడా విలువ చేయని ధర్మాకోల్‌తో కట్టి రూ.4-5 కోట్లు ఖర్చు చేశామని వైసీపీ నేతలు చెప్పుకోవడం నిజంగా సిగ్గుచేటు అని సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శిస్తున్నారు. జఫ్పాలకు కూల్చడమే కానీ ఎలా కట్టాలో తెలియదంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టిన వైసీపీ ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు.


బస్ బే సరిగ్గా కట్టలేని ప్రభుత్వానికి మూడు రాజధానులు కట్టేంత సీనుందా అని పలువురు నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. బస్ బే నిర్మాణం జగన్ ప్రభుత్వ క్వాలిటీ, బ్రాండ్‌ను తెలియజేస్తోందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఈ బస్ బేకు జగన్ ఫోటో పెట్టడంపైనా మీమ్స్ రాయుళ్లు ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కంటెంట్ వీక్.. ప్రచారం పీక్స్ అన్న తరహాలో జగన్ తీరు ఉందని మండిపడుతున్నారు. ప్రతి పనిలో తన ఫోటో వేసుకోవడం జగన్‌కు ఫ్యాషన్ అయిపోయిందని చురకలు అంటిస్తున్నారు.


మరోవైపు bus bay కూలిందంటే తప్పునాది కాదు కట్టిన మేస్త్రిది అన్నట్లు జగన్ నీతులు చెప్తారని.. నాడు నేడు స్కూల్లో పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ కాకపోతే తప్పునాది కాదు పాఠాలు చెప్పిన టీచర్‌ది అంటారని.. కల్తీ బ్రాండ్స్ తాగి సచ్చిపోతే తప్పు నాది కాదు తాగిన మందు బాబులది అంటారని పలువురు నెటిజన్‌లు సెటైర్లు వేస్తున్నారు.


అటు బస్ బే కూలిపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా స్పందించారు. ‘విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో మీరు నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలింది.. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యింది.. రాష్ట్రంలో బస్సులు తిరగడానికి సరైన రోడ్డులు లేవు కానీ, మీ ప్రచార ఆర్భాటాల కోసం ఇలా ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు.. ఒక చిన్న బస్ షెల్టర్ నే సక్రమంగా కట్టలేని వాళ్ళు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు.. తుమ్మితే ఊడిపోడే ముక్కు చందంగా మారిన బస్‌షెల్టర్లు కోసం ఆరోజు గ్రీన్‌బెల్ట్‌లోని దశాబ్దాల వయస్సు కలిగిన భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికేసుకుంటూ పోయారు.. విశాఖ నగరంలో కొన్నిచోట్ల ఏడాది కిందటే లక్షలాది రూపాయలు వెచ్చించి బస్‌ షెల్టర్‌లను నిర్మించారు, దృఢంగా ఉన్న ఆ బస్ షెల్టర్లను కూడా పూర్తిగా తొలగించి ఇలాంటి నాసిరకం బస్‌షెల్టర్లు నిర్మించి ప్రజా ధనాన్ని వృధా చేస్తూ... ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తున్నారు.. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, మీ ప్రచారాల ప్రభుత్వం కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు... ఇక ప్రజలు బై జగన్.. బై బై జగన్ అని చెప్పాల్సిన సమయం వచ్చేసింది’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్విటర్‌ (X) వేదికగా పోస్ట్ చేశారు.

Updated Date - 2023-08-28T14:32:47+05:30 IST