Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

ABN , First Publish Date - 2023-07-05T17:37:43+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో కృష్ణుడు. సోమవారం ఎంపీ భరత్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు.

Rajahmundry City: ఫుల్ కన్ఫ్యూజన్‌లో జగన్.. నాలుగేళ్లలో.. ఐదో కృష్ణుడి పేరు తెరపైకి..!

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో కృష్ణుడు. మొదట్లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కోఆర్డినేటర్‌గా ఉండేవారు. ఆయన్ను తప్పించి సీఎం జగన్‌ స్వయంగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యంను నియమించారు.

కొన్ని నెలల పోయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. తర్వాత ఎంపీ మార్గాని భరత్‌కు సిటీ బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఎంపీ భరత్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు. సిటీలో ఒక పక్క మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. మరోక పక్క శివరామసుబ్రహ్మణ్యం వంటి నేతలను పక్కన పెట్టి డాక్టర్‌ శ్రీనివాస్‌కు పగ్గాలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-07-05T17:37:45+05:30 IST