NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-09-13T11:40:08+05:30 IST

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు

స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. హైకోర్టు జడ్జికి.. అటు చంద్రబాబు తరఫున.. ఇటు సీఐడీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. రెండువైపులా వాదనలు పూర్తిగా వినాలన్న న్యాయస్థానం.. ఇందుకుగాను విచారణ వాయిదా వేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోసాని, దమ్మలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు.. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు వినిపించారు.


Chandrababu-Car.jpg

అభ్యంతరాలున్నాయా..?

చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోర్టును లాయర్లు కోరారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్-13 ఐపీసీ 409 చెల్లవని క్వాష్ పిటిషన్‌లో బాబు పేర్కొన్నారు. సాక్ష్యాలు లేకున్నా రాజకీయ ప్రతికారంతోనే కేసు పెట్టారని పిటిషన్‌లో చంద్రబాబు లాయర్లు వివరించారు. అయితే.. అన్ని ఆధారాలతోనే రిపోర్టు ఇచ్చామని సీఐడీ తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్‌కు మారుస్తామని చంద్రబాబు లాయర్లకు కోర్టు తెలిపింది. ఇందుకు స్పందించిన లూథ్రా తనకు ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపారు. అంతేకాదు.. గతంలో తాను పీపీగా చేశానని.. అభ్యంతరాలు ఉంటే చెప్పాలని మరోసారి హైకోర్టు జడ్జి చెప్పారు.

ap-high-court.jpg

కీలక ఆదేశాలు ఇవీ..

బాబును కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై సీఐడీకి ఒకింత షాక్ కూడా తగిలింది. ఈనెల 18వరకు చంద్రబాబుపై ఎలాంటి విచారణ చేపట్టవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. వచ్చేసోమవారం వరకు కస్టడీకి కూడా తీసుకోవద్దని సీఐడీని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ.. ఇవ్వొద్దని బాబు తరఫు లాయర్లు న్యాయమూర్తిని కోరారు. దీంతో కోర్టు పైవిధంగా ఆదేశాలు జారీచేసింది. మరోవైపు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది.

AP-CID.jpg

Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ


Updated Date - 2023-09-13T12:20:23+05:30 IST