YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌కు సమన్లు.. ఏం జరుగుతుందో ఏమో..!?

ABN , First Publish Date - 2023-07-14T18:39:22+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది..

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు నుంచి అవినాష్‌కు సమన్లు.. ఏం జరుగుతుందో ఏమో..!?

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS Viveka Mur) కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి (MP YS Avinash Reddy) సీబీఐ కోర్టు (CBI Court) సమన్లు జారీచేసింది. ఆగస్టు-14న కోర్టుకు హాజరుకావాలని సమన్లలో (Summons) కోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar Reddy), ఉదయ్ కుమార్‌ రెడ్డిపై (Uday Bhaskar Reddy) సీబీఐ ఛార్జిషీట్ (CBI Chargesheet) వేసింది. కాగా.. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాశ్ రెడ్డిని సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. గత నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న వివేకా హత్య కేసులో ఒక్కసారిగా సీబీఐ కోర్టు నుంచి పిలుపురావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన్ను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే.. ఇప్పటి వరకూ సీబీఐ విచారణకు మాత్రమే పిలిచింది.. ఇప్పుడు కోర్టు సమన్లు ఇవ్వడంతో ఆగస్టు-14న ఏం జరుగుతుందో అని వైసీపీ వర్గాల్లో గుబులు మొదలైందట.


CBI-A.jpg

ఇదే లాస్ట్..!

ఇదిలా ఉంటే.. జూన్-18న ఆదివారం అయినప్పటికీ అవినాష్.. సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఒక్కరోజు మాత్రమే ముందు నోటీసులిచ్చి విచారణకు రావాలంటూ రావాలనడంతో.. మరుసటిరోజు ఉదయం 10:30 గంటలకు సీబీఐ కార్యాలయం అవినాష్ రెడ్డి వచ్చారు. అయితే.. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్‌ (Important Documents)ను అధికారులు ఇచ్చి 20 నిమిషాల్లోనే సీబీఐ కార్యాలయం నుంచి వెనుదిరిగారు. కాగా.. జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌ను ఆదేశించింది. అవినాష్ ముందోస్తు బెయిల్ పొందిన తరువాత నాలుగోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అవినాష్ ముందోస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ys-viveka.jpg

Updated Date - 2023-07-14T18:45:47+05:30 IST