BRS Banner : బీఆర్ఎస్ బ్యానర్‌లో అచ్చు తప్పు.. ఇదిగానీ మీరు చూశారనుకో..?

ABN , First Publish Date - 2023-06-26T14:30:23+05:30 IST

అవును.. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), వీరాభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చు తప్పు పడింది. అది కూడా ఎలాంటి తప్పంటే.. ముఖ్యమంత్రినే (Chief Minister) మంత్రిని.. మంత్రిని (Minister) ముఖ్యమంత్రిని చేసింనంత..! ఫ్లై ఓవర్లు (Fly Over) , స్కైవేలతో (Sky Way) భాగ్యనగరంలోని ఉప్పల్ నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి..

BRS  Banner : బీఆర్ఎస్ బ్యానర్‌లో అచ్చు తప్పు.. ఇదిగానీ మీరు చూశారనుకో..?

అవును.. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), వీరాభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో అచ్చు తప్పు పడింది. అది కూడా ఎలాంటి తప్పంటే.. ముఖ్యమంత్రినే (Chief Minister) మంత్రిని.. మంత్రిని (Minister) ముఖ్యమంత్రిని చేసింనంత..! ఫ్లై ఓవర్లు (Fly Over) , స్కైవేలతో (Sky Way) భాగ్యనగరంలోని ఉప్పల్ నియోజకవర్గం రూపురేఖలు మారుతున్నాయని బీఆర్ఎస్ శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. సోమవారం నాడు స్కైవేను మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. తమ నియోజకవర్గానికి మంత్రి కేటీఆర్ వస్తుండటంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ వీరాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇదే ఊపుతో ఉప్పల్‌లో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయించారు. ‘పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు విచ్చేయనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి స్వాగతం.. సుస్వాగతం’ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలో ప్రింట్ చేయించారు. ఇందులో కేటీఆర్ ఫుల్‌ ఫొటో పెద్ద సైజులో ప్రింట్ చేయించారు.. పేరు మాత్రం కేటీఆర్‌ది కాకుండా కేసీఆర్ అని తప్పుగా ముద్రించారు. ఇదంతా ఒకచోట రెండు చోట్ల కాదు.. నియోజకవర్గంలో దాదాపు అన్నిచోట్లా ఇలానే ఉండటం గమనార్హం.

WhatsApp Image 2023-06-26 at 1.55.14 PM.jpeg

సోషల్ మీడియా కామెంట్ల వర్షం..

ఈ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు కానీ.. కార్యకర్తలు కానీ.. కనీసం స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి (Bethi Subhas Reddy) కూడా గమనించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని తిట్టిపోయడం, కేసులు పెట్టడం కాదు.. కనీసం ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు మంత్రి అని తెలుసుకోవాలి.. ఎవరి ఫొటోలు ప్రింట్ చేయాలి..? ఎవరిపేర్లు ముద్రించాలి..? అనేది తెలుసుకుంటే మంచిదని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. పోనీ ఇలా ఫ్లెక్సీల్లో తప్పుగా ముద్రించడం ఇదేమైన మొదటిసారేం కాదు. ఇలా బీఆర్ఎస్ ఫ్లెక్సీల్లో అచ్చు తప్పులు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయ్.

WhatsApp Image 2023-06-26 at 1.55.14 PM (1).jpeg

ప్రారంభం రోజే ఓవరాక్షన్!

కాగా.. 10 కోట్ల రూపాయలతో శిల్పారామం మల్టీ పర్పస్ హాల్‌ను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి (Minister Mallareddy) ప్రారంభించారు. దీంతో పాటు.. అత్యంత రద్దీ కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించి.. హైదరాబాద్ ప్రజలకు ప్రజ‌ల‌కు అంకిత‌మిచ్చారు. రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్ట్ నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించడం జరిగింది. మరోవైపు.. కేటీఆర్ రాకతో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. దాదాపు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వరకు పూర్తిగా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.


ఇవి కూడా చదవండి..


YSRCP : పవన్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అసలు విషయం చెప్పేసిన ముద్రగడ.. అదేంటో కాపులకు తెలిస్తే..?


Vijayasai Retirement : వైసీపీలో పెను సంచలనం.. అయ్యో పాపం సాయిరెడ్డి.. జగన్ ఇలా తీసిపడేశారేంటి..!


Khammam Politics : పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. అన్ని పార్టీల చూపు ఖమ్మం వైపే.. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..!?


Updated Date - 2023-06-26T14:34:46+05:30 IST