YSRCP : పవన్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అసలు విషయం చెప్పేసిన ముద్రగడ.. అదేంటో కాపులకు తెలిస్తే..?

ABN , First Publish Date - 2023-06-23T15:20:57+05:30 IST

ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా హీటెక్కాయి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు, కౌంటర్లతో మార్మోగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) , జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) పేర్లే వినిపిస్తున్నాయి..

YSRCP : పవన్‌పై అక్కసు వెళ్లగక్కుతూ అసలు విషయం చెప్పేసిన ముద్రగడ.. అదేంటో కాపులకు తెలిస్తే..?

ఏపీ రాజకీయాలు (AP Politics) ఒక్కసారిగా హీటెక్కాయి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో సవాళ్లు, ప్రతిసవాళ్లు, కౌంటర్లతో మార్మోగుతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) , జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) పేర్లే వినిపిస్తున్నాయి. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై (Dwarampudi Chandrasekhar Reddy) పవన్.. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ మొదలైన ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకూ రెండు లేఖలు రిలీజ్ చేసిన ముద్రగడ.. మనసులోని విషయాలను బయటికి కక్కేశారు. ఇప్పటికే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని.. రానున్న ఎన్నికల్లో ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీచేస్తారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే..ఇంతవరకూ ఈ వార్తలను ఖండించకపోగా తాజాగా ఆయన రాసిన లేఖలో అసలు విషయం చెప్పేశారు.

Mudragada.jpg

ఇంతకీ ఏంటది..?

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ చేసినట్టుగా పవన్ పోటీకి సిద్ధం కావాలి. ఏ కారణంతోనైనా కాకినాడ నుంచి పోటీచేయబోనని తోకముడిస్తే పిఠాపురం నుంచి పోటీకి సిద్దపడాలి. అలా సిద్దపడిన తర్వాత నాకు సవాల్ చేస్తే.. నేను రెడీ అవుతానుఅని పవన్‌కు అక్కసు వెళ్లగక్కుతూ ముద్రగడ రాసిన లేఖలో (Mudragada Letter) తన మనసులోని మాటను బయటపెట్టేశారు. అంటే.. పిఠాపురం (Pithapuram Assembly Constituency) అసెంబ్లీ నుంచి పోటీచేయడానికి ముద్రగడ ముందే ఫిక్సయ్యారన్న మాట. సందర్భంగా వచ్చింది కాబట్టి ఇలా అసలు విషయం చెప్పేశారేమో. ఇన్నాళ్లు వైసీపీలో చేరిక, పోటీ అనేది కేవలం రూమర్స్ మాత్రమే అనుకున్న కాపు సామాజిక వర్గం.. తాజా లేఖతో అసలు విషయం బయటపడిపోయిందని గ్రహించింది. దీంతో ముద్రగడపై తీవ్ర ఆగ్రహంతో కాపు నేతలు రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తున్నట్లు చెప్పిన ముద్రగడ.. ఇప్పుడు పూర్తిగా ముసుగు తీయడంతో అసలు రూపం బయటపడిందని పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. 2019 ఎన్నికల్లో (2019 Elections) వైసీపీకి చేసిన ఊడిగం సరిపోలేదని.. రిజర్వేషన్ అమలు చేయకపోయినా, కార్పొరేషన్‌కు ఎలాంటి నిధులు కేటాయించనప్పటికీ ఇప్పుడు మళ్లీ వకల్తా పుచ్చుకోవడమేంటి..? అని సొంత సామాజిక వర్గమే తిట్టిపోస్తోంది.

Pawan-and-mudragada.jpg

పిఠాపురం నుంచే ఎందుకో.. ప్లాన్ ఇదేనా..?

ముద్రగడ వైసీపీలో చేరితే కాకినాడ ఎంపీ టికెట్ లేదా పిఠాపురంతో పాటు ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ ఆఫర్ చేస్తున్నట్లు గత వారంలో వార్తలొచ్చాయి. అంతేకాదు.. ముద్రగడ వైసీపీలోకి రాలేని పక్షంలో ఆయన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి.. లబ్ధి పొందాలన్నది వైసీపీ ప్లాన్.! అయితే.. ఈ క్రమంలోనే ముద్రగడ ఎంపీగా పోటీ చేయకపోవచ్చని.. పరిస్థితులు అనుకూలించి ఆయన ఓకే అంటే సరే.. లేకుంటే కుమారుడికి వైసీపీ కండువా కప్పాలనే ప్లాన్ వైసీపీ వ్యూహమట. అందుకే త వారంలో పిఠాపురం నుంచి ముద్రగడ కుమారుడేనని వార్తలు వచ్చాయి. అయితే కాస్త వెనక్కి వెళ్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. 18 మంది ఎమ్మెల్యేల (18 YSRCP MLAs) పనితీరు సర్లేదని.. అవసరమైతే వారందరి స్థానంలో కొత్త వారిని బరిలోకి దింపుతానని స్వయంగా సీఎం జగన్ చెప్పిన (CM Jagan Reddy) విషయం విదితమే. ఆ 18 మందిలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో అక్కడ్నుంచి ముద్రగడ కానీ ఆయన కుమారుడ్ని బరిలోకి దింపితే కాపుల ఓట్లు కలిసొస్తాయని జగన్ భావిస్తున్నారట. ఇందులో నిజానిజాలెంతో.. అసలు ముద్రగడ మాటవరుసకే అన్నారో లేకుంటే సీరియస్‌గా పోటీ చేయాలని అనుకుంటున్నారో తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

Mudragada-dwaram-pawan.jpg

Vijayasai Retirement : వైసీపీలో పెను సంచలనం.. అయ్యో పాపం సాయిరెడ్డి.. జగన్ ఇలా తీసిపడేశారేంటి..!


Updated Date - 2023-06-23T15:24:51+05:30 IST