Big Shock to Jagan: జగన్‌కు భారీ షాక్ ఇచ్చిన కొడాలి, వల్లభనేని.. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడానా.. గోడ దూకుతున్నారా..?

ABN , First Publish Date - 2023-04-03T16:01:31+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించిన వర్క్‌షాప్‌కు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కావడం ప్రస్తుతం..

Big Shock to Jagan: జగన్‌కు భారీ షాక్ ఇచ్చిన కొడాలి, వల్లభనేని.. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడానా.. గోడ దూకుతున్నారా..?

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Election Results) ఘోర పరాభవం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) నిర్వహించిన వర్క్‌షాప్‌కు (YCP Workshop) పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs Skip Jagan Meeting) దూరం కావడం ప్రస్తుతం అటు వైసీపీలో (YCP), ఇటు ఏపీ రాజకీయ వర్గాల్లో (AP Politics) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంతో సమావేశానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Mangalagiri MLA Alla Ramakrishna Reddy), గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Gudivada MLA Kodali Nani), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Gannavaram MLA Vallabhaneni Vamsi) (టీడీపీ రెబల్ ఎమ్మెల్యే), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరుకాలేదు. వీరిలో బుగ్గన కరోనా కారణంగా ముఖ్యమంత్రికి విషయం చెప్పి అనుమతి తీసుకుని గైర్హాజరయినట్లు తెలిసింది. కొంతకాలంగా సీఎం జగన్‌ తీరుపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. చాలా కాలంగా సీఎం జగన్‌రెడ్డికి ఆళ్ల దూరంగా ఉంటున్నారని తెలిసింది.

ఇది కూడా చదవండి: Jagan On Early Polls: ముందస్తు ఎన్నికలపై తేల్చి చెప్పిన సీఎం జగన్‌రెడ్డి.. ఆ ఒక్క మాటతో జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు!

ఆళ్ల తన కుమారుడి వివాహ వేడుకకు కూడా సీఎం జగన్ రెడ్డిని పిలవకపోవడం కొసమెరుపు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ వీడతారంటూ మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ నిర్వహించిన కీలక సమావేశానికి హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పార్టీ కేడర్‌తోపాటు ప్రజలకూ అందుబాటులో ఉండటం లేదు. గతంలో టికెట్‌ ఆశించి విఫలమైన ఒక మండల నేత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతర్గత కుమ్ములాటలు జోరుగా ఉన్నాయి. అదే సమయంలో టీడీపీ బలం పుంజుకుంటూ... అధికార పార్టీ నేతలను తనకు దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

వైసీపీ టికెట్ ఆశిస్తున్న వల్లభనేని వంశీ నియోజకవర్గంలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. కృష్ణా జిల్లా గన్నవరంలో నేతల మధ్య వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కీలక నేత, మాజీ మంత్రి పార్టీ మారతారని చర్చ జరుగుతోంది. జగన్‌పై రాజకీయ విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో నోరేసుకుని పడిపోయే నమ్మిన బంటు కొడాలి నాని కూడా జగన్ నిర్వహించిన ఈ వర్క్‌షాప్‌కు హాజరు కాకపోవడం వైసీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. ఈ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే గోడ దూకుతారనే ప్రచారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా జగన్ నిర్వహించిన ఈ కీలక సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. మొత్తంగా చూసుకుంటే.. ఈ ఎమ్మెల్యేల డుమ్మాలతో ఓ విషయం మాత్రం స్పష్టమైంది. కొందరు ఎమ్మెల్యేలు అధినేత జగన్ పట్ల తమ అసంతృప్తిని ఇలా వ్యక్తపరిచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: YCP Jagan: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జగన్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఏమన్నారో తెలిస్తే నోటితో నవ్వరు..!


జగన్ కూడా తన కాన్ఫిడెన్స్‌లో కోల్పోయారని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి. ‘రాజకీయంగా తనకు ఎదురులేదన్నారు.. ఏ ఎన్నిక వచ్చినా తమదే విజయమన్నారు.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సునాయాసంగా గెలిచే అవకాశమున్న ఉప ఎన్నికల్లో కూడా పలు అక్రమాలకు పాల్పడ్డారు. సరిగ్గా ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బొక్కబోర్లా పడ్డారు. నాలుగేళ్ల దుష్పరిపాలన చూసిన విద్యావంతులు కీలెరిగి వాత పెట్టారు’ అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మూడు గ్రాడ్యుయేట్‌ స్థానాల్లోనూ వైసీపీని మట్టి కరిపించి టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించారు.

చివరకు వైసీపీ ఎమ్మెల్యేల్లో సైతం సీఎం జగన్‌పై అసంతృప్తి నెలకొన్న విషయం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడింది. ప్రతిపక్ష అభ్యర్థికి అనుకూలంగా నలుగురు ఎమ్మెల్యేలు ఓటేయడమే దీనికి నిదర్శనం. ఎవరు ఓటేశారో తెలిసే అవకాశం లేకున్నా.. దీనిని సాకుగా చూపి తనకు గిట్టని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయినా శాసనసభ్యుల్లో అసమ్మతి స్వరం రానురాను పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. చివరకు పార్టీ ఇన్‌చార్జులు, ద్వితీయ శ్రేణి నేతల్లోనూ సర్కారుపై వ్యతిరేకత ప్రబలుతోంది. సంక్షేమ పథకాల పేరు చెప్పి అభివృద్ధిని స్తంభింపజేయడంపై అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తిని ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బయటకు వెళ్లగక్కుతున్నారు.

Updated Date - 2023-04-03T16:01:43+05:30 IST