TS Politics : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-09-28T20:44:09+05:30 IST

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక తమకు తిరుగులేదు.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతామన్న బీఆర్ఎస్ పార్టీకి (BRS), సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లు తగులుతున్నాయి...

TS Politics : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) సమీపిస్తున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక తమకు తిరుగులేదు.. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి తీరుతామన్న బీఆర్ఎస్ పార్టీకి (BRS), సీఎం కేసీఆర్‌కు (CM KCR) ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ (Congress, BJP) కంటే ముందుగానే ఒకేసారి 115 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకూ చలీచప్పుడు చేయట్లేదనే ఆరోపణలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్న పరిస్థితి. టికెట్ రాని సిట్టింగులు, టికెట్ ఆశించి భంగపడిన ముఖ్యనేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది.


Mynampalli-Congress.jpg

అందరూ బిగ్ షాట్‌లే..!

బీఆర్ఎస్‌కు చెందిన బిగ్ షాట్‌లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanmantha Rao), ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohit).. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam), మాజీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌లు (Kambam Anil Kumar) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Malli Karjuna Kharge) సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరందర్నీ సాదరంగా కాంగ్రెస్ పెద్దలు పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే బీఆర్ఎస్‌లో టికెట్ రాని మరో ఇద్దరు సిట్టింగులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలియవచ్చింది. కాగా ఢిల్లీలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), సీనియర్ నేత షబ్బీర్ అలీ పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. మొత్తానికి చూస్తే.. తాజా చేరికలతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరినట్లయ్యింది. మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ తిరుగుబావుటా ఎగరేశారు. ఇక వేముల వీరేశం పరిస్థితి కూడా అంతే. కుంభం అనిల్ మాత్రం కాంగ్రెస్ నుంచి కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మళ్లీ సొంత గూటికి వచ్చేశారు.

Congress.jpg

ఏం జరగబోతోంది..?

మైనంపల్లి చేరికతో హైదరాబాద్‌లో కుత్బల్లాపూర్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలతో ఇంకా ఒకట్రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. కనీసం లేదంటే నాలుగు నియోజకవర్గాల్లో మైనంపల్లి ప్రభావితం చేస్తారని ఆయన ముఖ్య అనుచరులు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక వీరేశం విషయానికొస్తే.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ‘కారు’ గుర్తుపై పోటీచేయగా.. స్వతంత్ర అభ్యర్థికి ‘ట్రక్కు’ గుర్తు వచ్చింది. దీంతో కాస్త కన్ఫూజ్ అయిన నియోజకవర్గ ప్రజలు ఇటు వేయాల్సిన ఓట్లు అటు వేయడంతో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన చిరుమర్తి లింగయ్యకు గెలిచి.. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఈసారి చిరుమర్తికే కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వీరేశం కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇక కంభం అనిల్ కుమార్ పక్కాగా గెలుస్తారని ఢిల్లీలోని హైకమాండ్‌కు వరుస నివేదికలు వెళ్లడంతో తిరిగి సొంత గూటికి తీసుకురావడానికి రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి.. పార్టీలోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇవాళ చేరిన ఈ నేతలందరికీ దాదాపు టికెట్లు ఫిక్స్ అయినట్లుగా సమాచారం.

మొత్తానికి చూస్తే.. తాజా చేరికలతో మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని పార్టీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

congress.jpg


ఇవి కూడా చదవండి


Jagan Adani : వైఎస్ జగన్ రెడ్డితో అదానీ భేటీ.. ప్రేమతో ఈసారి బిగ్ డీల్..!?


YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా


CBN Case : చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర..!


Updated Date - 2023-09-28T20:56:32+05:30 IST