Share News

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

ABN , First Publish Date - 2023-10-24T12:59:44+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్కిల్ కేసులో (CBN Skill Case) అక్రమ అరెస్ట్‌తో తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు..

Roja : అవును.. ‘నిజం గెలవాలి’.. ఇదేగానీ జరిగితే..!

స్కిల్ కేసులో (CBN Skill Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను జీర్ణించుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన వందలాది అభిమానులు, కార్యకర్తలు తుదిశ్వాస విడిచారు. ఆ కుటుంబాలను పరామర్శించి, భరోసా కల్పించడానికి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట బాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం నుంచి కుప్పం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే.. భువనేశ్వరి యాత్రపై ఏపీ మంత్రి రోజా (Minister Roja) స్పందిస్తూ ఒకింత కౌంటర్లు, వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం గురించి కూడా రోజా ప్రస్తావన తెచ్చారు.


Babu-And-Bhuvaneswari.jpg

మేం కూడా కోరుకుంటున్నాం..!

నిజం గెలవాలంటూ నారా భువనేశ్వరి దేవుడికి గట్టిగా పూజలు చేశారు. అవును.. మేం కూడా నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. నిజమే గనుక గెలిస్తే జీవితాంతం చంద్రబాబు జైల్లో ఉంటారు. చంద్రబాబు జైల్లోనే శాశ్వతంగా ఉండాలని వెంకటేశ్వర స్వామికి భువనేశ్వరి పూజలు చేసినట్లు ఉన్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్, భువనేశ్వరీ జైల్లోనే వుంటారు. నిజం గెలవాలని భువనేశ్వరికి మనస్పూర్తిగా ఉంటే సీబీఐ ఎంక్వయిరీ కోరితే నిజం ఖచ్చితంగా గెలుస్తుంది. స్కిల్, ఐఆర్ఆర్ కేసులో భువనేశ్వరి సీబీఐ విచారణను కోరాలిఅని రోజా చెప్పుకొచ్చారు. కాగా.. ఇవాళ్టి నుంచి మరో మూడ్రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి బస్సు యాత్రం చేపడుతున్నారు. ఈ సందర్భంగా పలు బహిరంగ సభల్లో కూడా ఆమె ప్రసంగించనున్నారు. రోజా కామెంట్స్‌పై భువనేశ్వరి రియాక్ట్ అవుతారేమో చూడాలి.

Roja-Selvamani.jpg

ఎందుకీ జోస్యం..!

పవన్, లోకేష్ (Pawan, Lokesh) ఇద్దరు కలిసి నిన్న పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు. పాడుతా తీయగా కార్యక్రమం లాగా ఇటు ఆరుగురు.. అటు ఆరుగురు కూర్చుని సెలక్షన్స్ చేశారు. అర సున్న.. అర సున్నా కూర్చుని జైల్లో ఉన్న గుండు సున్న కోసం పార్టీ దశ, దిశపై చర్చించామన్నడం హాస్యాస్పదంగా ఉంది. వై ఏపీ నీడ్స్ పవన్, చంద్రబాబు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళే దమ్ము ధైర్యం వాళ్ళకు ఉందా..?. అలా వెళితే ప్రజలు వారి పళ్ళు రాళ్ళతో పగలకొడతారు. చంద్రబాబు జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లోకేష్ యువగళానికి మంగళం పాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో భువనేశ్వరి యాత్ర చేసే పరిస్థితి లేదు. లోకేష్, పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఛీకోట్టి ఓడించారుఅని మంత్రి రోజా జోస్యం చెప్పుకొచ్చారు. రోజా కామెంట్స్‌పై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా రోజాపై కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.

Janasena-TDP-Meeting.jpg


ఇవి కూడా చదవండి


Bhuvaneswari : పరామర్శకు వస్తున్నా.. నిజం గెలవాలి!


Birth Day : ప్రభాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే పొగడ్తల వర్షం.. సడన్‌గా ఎందుకిలా..?


TS Assembly Polls : ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. ఒకేసారి ఐదుగురు రాజీనామా!Updated Date - 2023-10-24T13:07:46+05:30 IST