CM KCR : నాడు ‘అమ్మ’.. నేడు సార్ విషయంలో సేమ్ సీన్.. తిట్టిపోసినోళ్లే ప్రోత్సహిస్తున్నారా.. ఈ మొక్కుడు వెనుక ఇంత పెద్ద కథుందా..!?

ABN , First Publish Date - 2023-05-01T21:13:32+05:30 IST

నాడు అమ్మ.. నేడు అయ్య.. ఇద్దరూ ఇద్దరే..! తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం (TS New Secretariat) సందర్భంగా జరిగిన ఒకట్రెండు సన్నివేశాలతో ఇప్పుడు అందరూ ..

CM KCR :  నాడు ‘అమ్మ’.. నేడు సార్ విషయంలో సేమ్ సీన్.. తిట్టిపోసినోళ్లే ప్రోత్సహిస్తున్నారా.. ఈ మొక్కుడు వెనుక ఇంత పెద్ద కథుందా..!?

నాడు అమ్మ.. నేడు సార్.. ఇద్దరూ ఇద్దరే..! తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం (TS New Secretariat) సందర్భంగా జరిగిన ఒకట్రెండు సన్నివేశాలతో ఇప్పుడు అందరూ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను (Jayalalitha) గుర్తు చేసుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఇలా జరగడంతో ఈ సంస్కృతి రాష్ట్రానికి ఎలా వచ్చిందబ్బా..? అని అందరూ ఆలోచనలో పడ్డారు. ఇంతకీ తమిళనాడు (Tamil Nadu) నుంచి తెలంగాణకు వచ్చిన ఆ కొత్త సంస్కృతి (New Culture) ఏంటి..? ఇప్పుడు నెట్టింట్లో ఎక్కడ చూసినా ఇదే విషయం ఎందుకింతలా చర్చనీయాంశమైంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!

TS--New-Secratariat.jpg

ఇదీ అసలు కథ..!

తమిళనాడులో ఒకప్పుటి రాజకీయాలు (Tamil Nadu Politics) కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఒక లక్షణం మాత్రం ఇతర ప్రాంతాల ప్రజలకు చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. అలనాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి.. ఆమె పాలన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తమిళనాట అసెంబ్లీ వేదికగా జరిగిన ఒక సన్నివేశం తర్వాత తమిళులు ముద్దుగా పిలుచుకునే ‘అమ్మ’లో (Amma) పెనుమార్పులు వచ్చేశాయ్. పురట్చితలైవి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా, మంత్రివర్గ సమావేశం నిర్వహించినా జనాలు, ప్రజాప్రతినిథులు, మంత్రులు పదే పదే ఆమె పాదాల మీద పడి మొక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మంత్రులు, ప్రజాప్రతినిథులు అందరూ ఒకేసారి ‘అమ్మ’కు సాష్టాంగ నమస్కారం చేసి.. అందరూ ఒకేసారి మళ్లీ పైకి లేస్తుంటారు. ఇదంతా ఇతర ప్రాంతాల ప్రజలకు చాలా విచిత్రంగా అనిపించేది. అయితే అక్కడ మాత్రం పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు, పెద్దలకు ఇచ్చే గౌరవంగా భావిస్తారట. బాబాలు, స్వామీజీల కంటే ముఖ్యమంత్రిని ఈ రేంజ్‌లో మొక్కుతున్నారేంటబ్బా..? అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేవారు. ఒక్క తమిళనాడులో తప్ప.. ఇలా ‘కాళ్లు మొక్కుడు’ మరెక్కడా దాదాపు కనిపించలేదు. కానీ తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు సీన్ జరిగింది. సచివాలయం ఓపెనింగ్ తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) కేబిన్‌లోకి ఎంటరైన అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇలా బీఆర్‌ఎస్‌ పార్టీలోని జూనియర్‌ నాయకుల నుంచి సీనియర్‌ నేతల దాకా అందరూ సీఎంకు పాదాభివందనం చేశారు. ఒకరి తర్వాత ఒకరు అందరూ వరుసపెట్టి రావడం, సీఎంకు బొకే ఇచ్చి కాళ్లకు మొక్కడం.. ఇదే తీరు కొనసాగింది. మంత్రి హరీష్ రావు కూడా సీఎం కాళ్లు మొక్కే కార్యక్రమాన్ని కొనసాగించారు.

Jayalalitha.jpg

అంబేద్కర్ భవన్‌లో ఇదేంటో..!

వాస్తవానికి గతంలో ఎప్పుడో ఒకప్పుడు.. ఎవరో ఒకరు తప్ప సీఎం, మంత్రుల కాళ్లకు దండం పెట్టినంత పనిచేయలేదు. మహా అంటే పరస్పరం గౌరవించుకుంటూనే పని చేసుకు వెళ్లే వాళ్లే తప్ప ఇలా పాదాభివందనం మాత్రం చేయలేదు. ‘రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తిపూజ అనేది పతనానికి.. అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది’.. వ్యక్తిపూజపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిశ్చితాభిప్రాయమిది! అలాంటిది ఆయన పేరుతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవంలో మాత్రం అడుగడుగునా వ్యక్తిపూజే కనిపించింది!. అంబేడ్కర్ పేరుపెట్టుకున్న భవన్‌లో బీఆర్ఎస్ నేతల ‘కాళ్లు మొక్కుడు’ కార్యక్రమాన్ని మేథావులు, రాజకీయ విశ్లేషకులు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇక కొందరైతే కేవలం శుభాకాంక్షలతోనే (Wishes) సరిపెట్టుకున్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించి కుడిచేతికి కట్టుకునే ‘ఇమామ్‌-ఏ-జామిన్‌’ను హోంమంత్రి మహమూద్‌ అలీ.. సీఎం చేతికి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు సబిత, ఎర్రబెల్లి, స్పీకర్‌ శ్రీనివా‌స్‌రెడ్డి, మండలి చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి, ఎంపీ కేశవరావు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. సచివాలయంలో జరిగిన ఈ సీన్‌ చూసిన జనాలు.. అసలు ఎప్పుడూ లేని ఈ కల్చర్‌ తెలంగాణలో సడన్‌గా ఎలా ఎంట్రీ ఇచ్చిందబ్బా..? అని తెగ చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్‌లో మీమ్స్ పేలిపోతున్నాయ్. ఈ కాళ్లు మొక్కుడు వీడియోలకు కామెంట్స్ అయితే లెక్కలేనన్ని చిత్రవిచిత్రాలుగా వచ్చేస్తున్నాయ్.

KCR.jpg

అసలు విషయం ఇదేనేమో..!

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి కెమెరాలు ఆపి మరీ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దళితబంధులో రూ.3 లక్షల దాకా లంచాలు తీసుకున్నారు! అవినీతికి పాల్పడిన వారి చిట్టా నా దగ్గర ఉంది. ఇలాంటివి రిపీట్‌ అయితే టికెట్‌ ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు మారడం లేదు. సరిగా పనిచేయని వారి తోక కత్తిరిస్తా’ ఇవీ సాక్షాత్తూ కేసీఆర్ పలికిన మాటలు. పైగా కేసీఆర్ చేయించిన సర్వేల్లో చాలా మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ అస్సలు బాగోలేదని చాలా రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయ్. అటు సర్వేలు, ఇటు కేసీఆర్ వార్నింగ్‌లతో హడలెత్తిపోయిన కొందరు ఎమ్మెల్యేలు రానున్న ఎన్నికల్లో టికెట్ రాదని భయపడిపోయారట. అందుకే ఎమ్మెల్యేలు ఇలా కేసీఆర్‌‌ కాళ్లు మొక్కి మరీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని బయట పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. బహుశా ఇదే నిజమైనా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే కాళ్లు మొక్కే వ్యక్తి అభిమానంతో అలా చేసినా.. కేసీఆర్ మాత్రం అహంకారంతోనే ఇలా చేయించుకున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి, సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వస్తున్నాయి. వాస్తవానికి ఇలాగే బీజేపీ నేతలు.. కేంద్రంలోని పెద్దల కాళ్లు మొక్కినప్పుడు ఇదేం సంస్కృతి.. సిగ్గు, శరం ఏమైనా ఉందా అని సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇంకా చాలా మంది నేతలు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి మాట్లాడారు. మరి ఇప్పుడు ఇదే సీన్ సొంత పార్టీలో జరిగింది కదా.. ఏమంటారో..!

KCR-Mokkudu-Photos.jpg

నాడు అలా.. నేడు ఇలా..!

మొత్తానికి చూస్తే.. తమిళనాడు ‘అమ్మ’ హయాంలో ఉన్న సంస్కృతి.. ఇప్పుడు తెలంగాణకు అయితే వచ్చేసింది. వాస్తవానికి పెద్దలను గౌరవిస్తూ నమస్కరించడంలో ఎలాంటి తప్పులేదనుకోండి.. కానీ ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఇలాంటి ‘కాళ్లు మొక్కుడు’ వ్యవహారంతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు కాళ్లు మొక్కారనేది తెలియట్లేదు కానీ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ మాత్రం నడుస్తోంది. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడు బండి సంజయ్ ఆయన కాళ్లకు నమస్కరించారని.. గుజరాతీ పాదాల దగ్గర బండి సంజయ్ తాకట్టుపెట్టారంటూ మంత్రి కేటీఆర్ విమర్శించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. వీడియో పోస్ట్ చేసి మరీ కామెంట్స్ చేసిన కేటీఆర్ ఇప్పుడు తెలంగాణలో జరిగిన ‘కాళ్లు మొక్కుడు’ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారు..?. మరోవైపు.. నిద్రలేచింది మొదలుకుని పడుకునే దాకా మాట్లాడితే తెలంగాణ సంస్కృతిని తానే కాపాడుతున్నట్లు చెప్పుకొనే కేసీఆర్.. ఇప్పుడిలా నేతలు వంగివంగి దండాలు పెట్టడంపై ఏమంటారు? ఇది కూడా తెలంగాణ సంస్కృతి అంటారా? లేకుంటే ప్రోత్సహిస్తూ ముందుకెళ్తారా..? ఇవన్నీ కాదని అసలే స్పందించకుండా కేసీఆర్ మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Mallareddy On AP : ఏపీ గురించి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇన్ని మాటలు అనేశారేంటి.. రచ్చ రచ్చ చేశారుగా..!
******************************

Chikoti Arrest : అరెస్టయిన చికోటి ప్రవీణ్ థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ కోసం ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడో తెలిస్తే..

******************************

Chikoti Praveen : థాయిలాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 14 మంది మహిళలు కూడా..

******************************

Casino King Chikoti : థాయిలాండ్‌లో చికోటితో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు.. కీలకంగా వ్యవహరించిన మహిళ..!

******************************

New Secretariat : కొత్త సచివాలయంకు వెళ్లిన ఉద్యోగుల్లో గందరగోళం.. తొలిరోజు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..

******************************

Mallareddy Comedy : బాబోయ్.. మల్లారెడ్డి.. పాలు, పూలు, కూరగాయలు అమ్మడమే కాదు.. ఇంకా చాలానే చేశారుగా.. పగలబడి నవ్వే విషయం చెప్పిన కేటీఆర్..

******************************

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

******************************

Updated Date - 2023-05-01T21:21:49+05:30 IST