TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?

ABN , First Publish Date - 2023-07-29T20:15:14+05:30 IST

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో (MP R Krishnaiah) టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌రావు ఠాక్రే (Manikrao Thakre), మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతు (VH Hanumanthu) భేటీ అయ్యారు. అంతా ఓకేగానీ..

TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యతో (MP R Krishnaiah) టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్‌రావు ఠాక్రే (Manikrao Thakre), మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతు (VH Hanumanthu) భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉండే కృష్ణయ్య నివాసానికెళ్లిన కాంగ్రెస్ పెద్దలు (Congress Leaders) సుమారు అరగంటకుపైగా పలు కీలక విషయాలపై చర్చించారు. తెలంగాణలోని ఓబీసీలకు (OBC) కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. ఇందుకు కృష్ణయ్య మద్ధతుగా కావాలని పెద్దలు కోరారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఓకే అంటే ఒక తలనొప్పి.. లేదనకుంటే ఇంకో తలనొప్పిగా కృష్ణయ్య పరిస్థితి ఉంది. ఇంతకీ కాంగ్రెస్ పెద్దలు ఇంకా ఏమేం చర్చించారు..? కృష్ణయ్యకు వచ్చిన చిక్కులేంటి..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Mani-Takre.jpg

అసలేం జరిగింది..?

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ (TS Congress) జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు ముందుకెళ్తున్నారు. ఇందుకోసం ఏ చిన్నపాటి ఛాన్స్ వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మార్చుకుని కాంగ్రెస్ నేతలు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని బీసీలను పార్టీకి మద్దతు కోరాలని ఆ సామాజిక వర్గం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్యను కాంగ్రెస్ నేతలు కలిశారు. తాజా రాజకీయ పరిస్థితి, ఎన్నికల్లో మద్దతుపై చర్చించారు. గత కొద్ది రోజులుగా బీసీ జనగణన చేయాలని కృష్ణయ్య.. రాజకీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు.. చాలా రోజులుగా బీసీ జనగణనకు యువనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కృష్ణయ్యతో కాంగ్రెస్ నేతల భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఉండే ఓబీసీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీల సమస్యలు, బడ్జెట్, ప్రజా ప్రతినిధుల అంశాలపై కాంగ్రెస్ సానుకూలంగా ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు. కృష్ణయ్య డిమాండ్స్.. కాంగ్రెస్ నినాదం వేరు కాదని మాణిక్ ఠాక్రే చెప్పుకొచ్చారు. తెలంగాణలో కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్ని హామీలు నెరవేరుస్తామని మాటిచ్చారు. సో.. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో బీసీ సంఘాల మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పటికే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని పీఏసీ నిర్ణయించిన విషయం విదితమే.

YS-Jagan-and-R-Krishnaiah.jpg

అంతా ఓకేగానీ..?

కృష్ణయ్య డిమాండ్స్ ఓకే.. కాంగ్రెస్ హామీ ఇవ్వడం ఓకేగానీ.. ఆ పార్టీతో కలిసి పనిచేయడాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) ఒప్పుకుంటారా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. జగన్‌కు.. కాంగ్రెస్‌కు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వద్దనుకుని జగన్ వైసీపీ పెట్టారో అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటిది వైసీపీ తరఫున రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడిగా ఉంటూ.. తెలంగాణలో కాంగ్రెస్ మద్దతివ్వడాన్ని జగన్ ఒప్పుకుంటారా లేదా అని తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్‌ను ఒప్పించడానికి కృష్ణయ్య ప్రయత్నిస్తే.. ఒప్పుకుంటారా..? ఇది అయ్యే పనేనా..? అని బీసీ నేతలు (BC Leaders) చర్చించుకుంటున్నారట. అయితే.. రాష్ట్రం వేరు కాబట్టి ఆయనేమీ అభ్యంతరం చెప్పకపోవచ్చని.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని మరికొందరు అనుకుంటున్నారట. ఒకవేళ జగన్ ఒప్పుకోకపోతే కృష్ణయ్య ఎలా ముందుకెళ్తారు..? అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి చూస్తే.. కృష్ణయ్యకు పెద్ద చిక్కే వచ్చిపడింది.. ఫైనల్‌గా ఏం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

R-Krishnaiah.jpg


ఇవి కూడా చదవండి


Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!


Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?


YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు



Updated Date - 2023-07-29T20:24:32+05:30 IST