Jumping Red Light: సిగ్నల్ జంప్ చేశారో.. రూ.11.50లక్షలు కడితేగానీ మీ వాహనం మీ చేతికి రాదు.. హడలెత్తిపోతున్న వాహనదారులు!

ABN , First Publish Date - 2023-02-15T10:00:45+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ విభాగం (Traffic Department) కఠిన నిర్ణయం తీసుకుంది.

Jumping Red Light: సిగ్నల్ జంప్ చేశారో.. రూ.11.50లక్షలు కడితేగానీ మీ వాహనం మీ చేతికి రాదు.. హడలెత్తిపోతున్న వాహనదారులు!

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను (Road Accidents) నివారించేందుకు అక్కడి ట్రాఫిక్ విభాగం (Traffic Department) కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లను భారీగా పెంచింది. దీనిలో భాగంగా రెడ్ సిగ్నల్ క్రాస్ (Jumping Red Light) చేసిన వారికి 51వేల దిర్హమ్స్ (రూ.11.50లక్షల) వరకు జరిమానా విధిస్తుంది. ఇందులో వెయ్యి దిర్హమ్స్(రూ.22,570) సిగ్నల్ జంపింగ్‌కు, మరో 50వేల దిర్హమ్స్(రూ.11.28లక్షలు) జప్తు చేసిన వాహనాన్ని తిరిగి వాహనదారుడు పొందడానికి చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నేరాలకు సంబంధించి 2020 నాటి చట్టం నం.05 ప్రకారం రెడ్‌లైట్ సిగ్నల్‌ను జంప్ చేసినందుకు వాహనదారుడికి వెయ్యి దిర్హమ్స్ జరిమానాతో పాటు12 బ్లాక్ పాయింట్లు వేయడం జరుగుతుంది. అలాగే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తారు.

ఇది కూడా చదవండి: కువైత్ లేబర్ మార్కెట్‌లో భారతీయులదే హవా.. మనోళ్ల వాటా ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

దీనికి అదనంగా వాహనం 30 రోజుల పాటు జప్తు చేయబడుతుంది. ట్రాఫిక్ విభాగం స్వాధీనం చేసుకున్న వాహనాన్ని విడుదల చేయడానికి 50వేల దిర్హమ్స్ చెల్లించాలి. ఇక స్వాధీనం చేసుకున్న వాహనాన్ని వాహనదారుడు మూడు నెలల్లోగా విడిపించుకోకపోతే వేలం వేస్తారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అబుదాబి ట్రాఫిక్ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానంలో 2021 ఏడాదికి సంబంధించి రెడ్ సిగ్నల్ జంప్ (Red Signal Jumping) చేసినందుకుగాను మొత్తం 2,850 వాహనదారులకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు తాజాగా గతేడాది జరిగిన కొన్ని భయంకరమైన రోడ్డు ప్రమాదాల తాలూకు సీసీటీవీ ఫొటోలను సైతం అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తాము ఇలా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలను కూడా వెల్లడించారు. వాటి వివరాలు ఇలా...

ఇది కూడా చదవండి: కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం.. క్వీన్ ఎలిజబెత్ ప్రశంసలు.. ఇప్పుడేమో దేశ బహిష్కరణ.. యూకేలో భారతీయుడి దీనగాథ!

* లేఫ్ట్ లేన్‌లో వాహనాలకు దారి ఇవ్వకపోతే 400 దిర్హమ్స్ జరిమానా

* డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై చెత్త వేస్తే వెయ్యి దిర్హమ్స్, 6బ్లాక్ పాయింట్లు

* రోడ్డుపై అడ్డదిడ్డంగా నడిస్తే 400 దిర్హమ్స్

* వాహనం నడుపుతున్న సమయంలో ఫోన్ మాట్లాడితే 800 దిర్హమ్స్ జరిమానా, 4బ్లాక్ పాయింట్లు

* రోడ్డుపై ఆకస్మిక ఆగిపోవడం చేస్తే 1000 దిర్హమ్స్, 6బ్లాక్ పాయింట్లు

* ప్రమాదకరమైన రీతిలో వాహనాన్ని రివర్స్ తీసుకోవడం చేస్తే 500 దిర్హమ్స్, 4బ్లాక్ పాయింట్లు

* యూటర్న్ లేని చోట యూటర్న్ తీసుకుంటే 500 దిర్హమ్స్ ఫైన్, 4బ్లాక్ పాయింట్లు

* రాత్రివేళ వాహనానికి లైట్ లేకుండా డ్రైవ్ చేస్తే 500 దిర్హమ్స్ జరిమానా, 4బ్లాక్ పాయింట్లు

* ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 దిర్హమ్స్ ఫైన్, 4బ్లాక్ పాయింట్లు, 7 రోజులపాటు వాహనం జప్తు

Updated Date - 2023-02-15T10:00:46+05:30 IST