NRI: కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం.. క్వీన్ ఎలిజబెత్ ప్రశంసలు.. ఇప్పుడేమో దేశ బహిష్కరణ.. యూకేలో భారతీయుడి దీనగాథ!

ABN , First Publish Date - 2023-02-14T10:35:46+05:30 IST

మహమ్మారి కరోనా సమయంలో బ్రిటన్‌లో (Britain) ఉండే ఓ భారత వ్యక్తి (Indian) ఒకటికాదు రెండుకాదు ఏకంగా 50 కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాడు.

NRI: కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం.. క్వీన్ ఎలిజబెత్ ప్రశంసలు.. ఇప్పుడేమో దేశ బహిష్కరణ.. యూకేలో భారతీయుడి దీనగాథ!

లండన్: మహమ్మారి కరోనా సమయంలో బ్రిటన్‌లో (Britain) ఉండే ఓ భారత వ్యక్తి (Indian) ఒకటికాదు రెండుకాదు ఏకంగా 50 కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాడు. ఈ విషయం తెలిసి క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-II) అతడిని ప్రత్యేకంగా సత్కరించారు కూడా. కానీ, ఇప్పడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం దేశ బహిష్కరణ ముంగిట నిలిచాడు. అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన విమల్ పాండ్య (Vimal Pandya) 2011లో ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లాడు. మూడేళ్లు గడిచాక అతడు చదువుకుంటున్న కాలేజీ లైసెన్స్‌ను బ్రిటిష్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఈ విషయం తెలియని విమల్ 2013లో తన బంధువుల చికిత్స కోసం భారత్‌కు వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బ్రిటన్‌ వెళ్లాడు. అక్కడ వెళ్లిన తర్వాత అతనికి షాకింగ్ విషయం తెలిసింది. అక్కడ నివసించే హక్కును కోల్పోయాననే అసలు విషయం తెలిసి నిర్ఘాంతపోయాడు. అప్పటి నుంచి వీసా కోసం అతడు పోరాడుతూనే ఉన్నాడు.

సౌత్ లండన్‌లోని రోత్‌హెరితే ప్రాంతంలో నివసిస్తున్న పాండ్య అలుపెరగని న్యాయపోరాటం చేసి ఎంతో డబ్బులు ఖర్చు చేశాడు. అయినా చివరికి అతడికి నిరాశే ఎదురైంది. జనవరి 24న స్థానిక న్యాయస్థానం పాండ్యకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు వలసల విధాన సామాజిక శ్రేయస్సు కోసం దేశంలో అతడు ఉండకూడదని ఆదేశించింది. దాంతో అతడి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కాగా, న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేసేందుకు గరిష్టంగా 28 రోజుల వ్యవధి ఉంది. ఈ వ్యవధిని ఉపయోగించుకుని తన సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తున్నాడు.

V-Pandya.jpg

ఇది కూడా చదవండి: కువైత్ లేబర్ మార్కెట్‌లో భారతీయులదే హవా.. మనోళ్ల వాటా ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇక అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం బ్రిటన్ హోంశాఖ మనోడిని దేశం నుంచి బహిష్కరించడం ఖాయం. అయితే, స్థానికంగా ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న అతనికి చాలామంది స్థానికులు మద్దతు తెలుపుతున్నారు. పాండ్యకు వీసా తిరిగి ఇవ్వాలని, దేశంలో అతడిని ఉండనివ్వాలని వారు కోరుతున్నారు. దీనికోసం ఏకంగా ఆన్‌లైన్‌లో ప్రచార కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అతడికి మద్దతుగా 1,75,000 మంది సంతకాలు సేకరించారు. కాగా, పాండ్య దీనగాథ తెలిసి అక్కడివారు అయ్యోపాపం అంటున్నారు.

ఇది కూడా చదవండి: కువైత్‌లో నెల రోజుల క్రితం కనిపించకుండాపోయిన భారతీయుడు.. చివరికి విషాదాంతం..!

Updated Date - 2023-02-14T10:38:02+05:30 IST