TANA: 'తానా' న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2023-08-16T09:03:08+05:30 IST

తానా న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

TANA: 'తానా' న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TANA: తానా న్యూ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది పాల్గొన్న ఈ వేడకలలో 77 సంవత్సరాల క్రితం భారతదేశం ఎంత యాతన అనుభవించిందో తానా న్యూ ఇంగ్లండ్ మాజీ ఆర్ఆర్ కొల్లిపర శ్రీనివాస్, TAGB మాజీ అధ్యక్షులు శంకర్ మగపు వివరించారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీ, వల్లభాయి పటేల్ త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

TT.jpg

చాలా మంది గొప్ప వ్యక్తుల త్యాగాల ఫలితం ఆగస్టు 15 అని వవరించారు. జనగణమనతో పాటు అమెరికన్ జాతీయ గీతం పాడారు. అనంతరం భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై అని నినాదించారు. ఈ కార్యక్రమంలో తానా న్యూ ఇంగ్లండ్ ఆర్ఆర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, సురేష్ దోనేపూడి, భార్గవ్ ప్రక్కి, బిగ్ హెల్ప్ అధ్యక్షులు చాంద్, అమర్ జయం, అనిల్ శ్రీనివాస్ గోండి, అంకినీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిరంజన్, శశికాంత్ కృతజ్ఞతలు తెలిపారు.

T.jpg

TTTT.jpg

Updated Date - 2023-08-16T09:03:08+05:30 IST