Share News

TAMA: సామాజిక బాధ్యత, కుటుంబ భద్రత ప్రాధాన్యంగా సాగిన ‘తామా విల్ అండ్ ట్రస్ట్ గ్రాండ్ మేళా’

ABN , First Publish Date - 2023-11-04T07:56:37+05:30 IST

భారతదేశంలో వీలునామా ఎలాగో అమెరికాలో 'విల్ అండ్ ట్రస్ట్' దాదాపు అలాగే. అమెరికాలో కేవలం 33 శాతం మందికే విల్ అండ్ ట్రస్ట్ ఉంది. అందులోనూ ఎన్నారైలకు ఇంకా తక్కువ శాతం ఉంటుంది. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ఈ విల్ అండ్ ట్రస్ట్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

TAMA: సామాజిక బాధ్యత, కుటుంబ భద్రత ప్రాధాన్యంగా సాగిన ‘తామా విల్ అండ్ ట్రస్ట్ గ్రాండ్ మేళా’

TAMA: భారతదేశంలో వీలునామా ఎలాగో అమెరికాలో 'విల్ అండ్ ట్రస్ట్' దాదాపు అలాగే. అమెరికాలో కేవలం 33 శాతం మందికే విల్ అండ్ ట్రస్ట్ ఉంది. అందులోనూ ఎన్నారైలకు ఇంకా తక్కువ శాతం ఉంటుంది. జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ఈ విల్ అండ్ ట్రస్ట్ లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా సమయం కూడా పడుతుంది. ఇవన్నీ ఆలోచించి సామాజిక బాధ్యతతో కుటుంబ భద్రత ప్రధానంగా తామా వారు అక్టోబర్ 29న స్థానిక షారన్ కమ్యూనిటీ భవనంలో విల్ అండ్ ట్రస్ట్ గ్రాండ్ మేళా నిర్వహించారు. 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి అవగాహన వచ్చింది, అవసరం తెలిసింది. తామా స్పాన్సర్లు, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్స్ అయిన వేలా లైఫ్ ప్లాన్ వెంకట్ అడుసుమిల్లి, స్టెల్లార్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సాహిల్ విరాని, ట్రూ వ్యూ ఫైనాన్సియల్స్ లక్ష్మి పరిమళ నాటెన్డ్ల, సార్కబ్ సర్వీసెస్ శ్రీధర్ పోటబత్తుల, ఫిన్ ఇన్వెస్ట్ అబర్న ఇందులో పాల్గొన్నారు.

TTTTTT.jpg

విల్ అండ్ ట్రస్ట్ సెమినార్లు, మేళాలు ఇదివరకు అమెరికాలో జరిగాయి. కానీ తామా చేసిన విధానం చాలా ప్రత్యేకమైనది. చక్కగా నిర్వహించబడింది మరియు అందరి ఆదరణ పొందింది. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ చూడలేదనీ, తామా వారు సమాజానికి ఉపయుక్తమైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వచ్చినవారు శ్లాఘించడం తామా టీంకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. 2023లో ఇది తామా వారి 24వ కార్యక్రమం. రాబోయే రోజులలో ఫైనాన్సియల్ సెమినార్, చెస్, దీపావళి ఇలా ఇంకా ఎన్నో జరగబోతున్నాయి. వివరాల కోసం www.tama.org ని సందర్శించడం లేదా info@tama.org కి ఇమెయిల్ చేయవచ్చు.

T.jpg

ముందుగా తామా అధ్యక్షులు సాయిరామ్ కారుమంచి అందరినీ ఆహ్వానించి, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్స్‌ను సభకు పరిచయం చేశారు. అలాగే, తామా చేసే పలు కార్యక్రమాల వివరాలు తెలియజేశారు. ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి తామా చేసే ఫ్రీ హెల్త్ క్లినిక్, సెమినార్ల గురించి చెప్పి, విల్ అండ్ ట్రస్ట్ ఆవశ్యకతను పునరుద్ఘాటించారు. ఎక్స్పర్ట్స్ విల్, ట్రస్ట్, హెల్త్ కేర్ డైరెక్టివ్, పవర్ ఆఫ్ అటార్నీ, ఎగ్జిక్యూటర్, గార్డియన్ వంటి పలు అంశాల మీద మాట్లాడి, సభికుల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు. బూత్ స్టైల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి తామా జట్టు రిజిస్ట్రేషన్లు తీసుకుని ఎవరు ఏ బూత్‌కు వెళ్లాలో దిశా నిర్దేశం చేశారు.

TT.jpg

అలాగే వచ్చిన వారందరికీ తేనీరు, అల్పాహారం, మంచినీళ్లు ఇచ్చారు. మామూలు ధరల కంటే బాగా తగ్గింపు, అదీ ఈ రోజు మాత్రమే ఇవ్వడం వల్ల చాలా మంది విల్ అండ్ ట్రస్ట్ తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం విశేషంగా విజయం సాధించడానికి ఉపాధ్యక్షులు సురేష్ బండారు, బోర్డు కార్యదర్శి మధు యార్లగడ్డ, బోర్డు కోశాధికారి శ్రీనివాస్ ఉప్పు, రూపేంద్ర వేములపల్లి, శ్రీనివాస్ రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, శశి దగ్గుల, స్వప్న యార్లగడ్డ, సుజాత దేవరపల్లి, గౌరి కారుమంచి, యశ్వంత్ జొన్నలగడ్డ తోడ్పాటు అందజేశారు. విచ్చేసిన అందరికీ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్స్‌కు, వాలంటీర్లకు, తామా టీంకు ధన్యవాదాలు చెప్పి మధు సభను ముగించారు.

TTTTT.jpgTTT.jpg

Updated Date - 2023-11-04T07:56:38+05:30 IST