Canada: రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. కెనడాలో మహాత్ముడికి అవమానం

ABN , First Publish Date - 2023-03-29T07:34:58+05:30 IST

కెనెడాలోని బ్రిటిష్‌ కొలంబియా ఫ్రావిన్స్‌లో సైమన్‌ ఫ్రేజర్‌ వర్సిటీలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్థాన్‌ వాదులు ధ్వంసం చేశారు.

Canada: రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. కెనడాలో మహాత్ముడికి అవమానం

కెనడాలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం

టొరాంటో, మార్చి 28: కెనెడాలోని బ్రిటిష్‌ కొలంబియా ఫ్రావిన్స్‌లో సైమన్‌ ఫ్రేజర్‌ వర్సిటీలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఖలిస్థాన్‌ వాదులు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అక్కడి భారత్‌ కాన్సులేట్‌ జనరల్‌ తీవ్రంగా ఖండించారు. బాధ్యులను తక్షణం చట్టం ముందు నిలబెట్టాలని కెనడా అధికారులను కోరారు. మార్చి 23న కెనడాలోని హామిల్టన్‌ పట్టణంలోనూ ఖలిస్తాన్‌వాదులు మహాత్ముడి విగ్రహానికి పెయింట్‌ పూశారు.

Updated Date - 2023-03-29T07:34:58+05:30 IST