Umrah: ఉమ్రా యాత్రికులకు సౌదీ తీపి కబురు

ABN , First Publish Date - 2023-07-06T08:28:46+05:30 IST

అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది.

Umrah: ఉమ్రా యాత్రికులకు సౌదీ తీపి కబురు

రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) ఉమ్రా యాత్రికులకు తాజాగా తీపి కబురు చెప్పింది. యాత్రికులకు 'ఇ-వీసా'ల (e-visas) జారీని ప్రారంభించింది. ఈ మేరకు తాజాగా హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ(Ministry of Haj and Umrah) కీలక ప్రకటన చేసింది. ఉమ్రా యాత్ర కోసం వచ్చే విదేశీయుల కోసం ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సౌకర్యం వల్ల మరింత మంది ముస్లిం భక్తులు ఉమ్రా నిర్వహించుకోవడానికి వీలు పడుతుందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇక ఇ-వీసాల దరఖాస్తుల కోసం నూసక్ ప్లాట్‌ఫారమ్ (Nusuk platform)- https://www.nusuk.sa/ar/about ను సంప్రదించాలని కోరింది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా మరియు మదీనాలను సందర్శించడానికి సేవలను అందిస్తుందని తెలిపింది. అలాగే గృహ, రవాణా మరియు సమాచార సేవలను బహుళ భాషలలో పొందవచ్చని తెలియజేసింది.

ఇదిలాఉంటే.. గత నెలలో సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ (Saudi Arabia Ministry of Tourism) నిర్దిష్ట వీసాలను కలిగి ఉన్న విదేశీయులు గల్ఫ్ దేశానికి తక్షణ ఇ-వీసాను పొందడానికి అర్హులు అని ప్రకటించిన విషయం తెలిసిందే. యూకే (UK), యూఎస్ (US), స్కెంజెన్ దేశాలకు (Schengen nations) పర్యాటక వీసాను కలిగి ఉన్న వ్యక్తులు, అలాగే ఏదైనా యూరోపియన్ యూనియన్ (EU) దేశం నుండి శాశ్వత నివాసితులు ఈ కొత్త వీసాకు అర్హులు. అయితే, ఈయూ దేశంలోని యూకే, యూఎస్‌కి వ్యాపారం లేదా పర్యాటక వీసా ఉన్నవారు సౌదీ వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఆ స్థలాన్ని సందర్శించే మినహాయింపు సైతం ఉంది. ఇక పైన పేర్కొన్న వీసాలను కలిగి ఉన్నవారి మొదటి స్థాయి బంధువులకు కూడా కింగ్‌డమ్‌లో ఎంట్రీకి అనుమతి ఉంటుంది. అలాగే వీసా-ఆన్-అరైవల్‌ను (visa-on-arrival) కూడా పొందవచ్చు. కానీ, ఈ వీసా దరఖాస్తుదారులు తీర్థయాత్ర సమయంలో హజ్ లేదా ఉమ్రా చేయడానికి మాత్రం అనుమతించబడరు.

Indians: భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే టాప్ దేశాలు ఏవంటే..

Updated Date - 2023-07-06T08:28:46+05:30 IST