Share News

e-visa: మరో ఆరు దేశాలకు 'ఇ-వీసా' యాక్సెస్‌ను విస్తరించిన సౌదీ అరేబియా

ABN , First Publish Date - 2023-10-19T07:51:53+05:30 IST

ఇ-వీసా యాక్సెస్ విషయంలో సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. మరో ఆరు దేశాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

e-visa: మరో ఆరు దేశాలకు 'ఇ-వీసా' యాక్సెస్‌ను విస్తరించిన సౌదీ అరేబియా

రియాద్: ఇ-వీసా యాక్సెస్ విషయంలో సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. మరో ఆరు దేశాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక కొత్తగా ఇ-వీసా యాక్సెస్ పొందిన దేశాల జాబితాలో తుర్కియే, థాయ్‌లాండ్, పనామా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సీషెల్స్, మారిషస్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు (Tourists) ఇప్పుడు ఉమ్రాకు పరిమితమైన విశ్రాంతి, వ్యాపారం, మతపరమైన ప్రయాణాల వంటి ప్రయోజనాల కోసం ఇ-వీసాల (e-visas) ను పొందవచ్చని పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది.

ఈ విస్తరణతో సౌదీ అరేబియా (Saudi Arabia) ద్వారా విజిటర్ ఇ-వీసాలు పొందుతున్న దేశాల సంఖ్య 63కి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. వీటితో పాటు చెల్లుబాటయ్యే స్కెంజెన్, యూఎస్, బ్రిటన్ వీసాలు కలిగి ఉన్న వ్యక్తులు, ఆయా దేశాలలోకి ప్రవేశించడానికి గతంలో ఉపయోగించబడిన వారు ఇ-వీసాకు అర్హులు. యూరోపియన్ యూనియన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలు, అమెరికా శాశ్వత నివాసితులు ఇందులోకి వస్తారు.

ఇక సౌదీ అరేబియా 96గంటల స్టాప్‌ఓవర్ వీసాల (Stopover Visa) ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ వీసా సౌదియా, ఫ్లైనాస్ ద్వారా ప్రయాణించే ప్రయాణీకులు తమ చివరి గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు దేశంలో 96 గంటల వరకు స్టే చేయడానికి అనుమతిస్తుంది. సౌదీ పర్యాటక మంత్రిత్వశాఖ (Ministry of Tourism) 2019లో సందర్శకుల ఇ-వీసాను ప్రవేశపెట్టింది. అర్హత కలిగిన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు సౌదీ అరేబియా పర్యాటక ప్రదేశాలను అన్వేషించడానికి, వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి, సౌదీ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఒక గేట్‌వేగా దీనిని అందిస్తోంది. ఇలా వివిధ రకాల వీసా పథకాలతో విదేశీ సందర్శకులను ఆకర్షించే పనిలో అరబ్ దేశం ఉంది.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

Updated Date - 2023-10-19T07:55:12+05:30 IST